News June 14, 2024

కడప: తిరుమల ఎక్స్‌ప్రెస్ నంబర్ల మార్పు

image

కడప-విశాఖపట్నం మధ్య తిరుగుతున్న తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు నంబర్లలలో మార్పు చేసినట్లు కడప రైల్వే చీఫ్ టికెట్ ఇన్‌స్పెక్టర్ ఉమర్ బాషా తెలిపారు. కడప- విశాఖపట్నం, విశాఖపట్నం-కడప మధ్య నడిచే ఈ రైలు ప్రస్తుతం 17487/17488 నంబర్లతో నడుస్తోంది. జులై ఒకటో తేదీ నుంచి ఈ రైలు 18521/18522 నంబర్లతో నడుస్తుందని ఆయన తెలిపారు. ప్రయాణికులు ఈ మార్పును గుర్తించాలని సూచించారు.

Similar News

News October 2, 2024

రక్తదానం చేసి ప్రాణాలను కాపాడాలి: కలెక్టర్

image

ప్రతి ఒక్కరూ మానవుడిగా పుట్టినందుకు రక్తదానం చేసి ప్రాణాలను కాపాడాలని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి అన్నారు. జాతీయ స్వచ్ఛంద దాతల దినోత్సవం సందర్భంగా.. ప్రభుత్వ రక్తనిధి కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం, మంగళవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి ముఖ్య అతిధిగా కలెక్టర్ పాల్గొన్నారు.

News October 2, 2024

జాతీయ సేవకులకు వైవీయూ పురస్కారాలు

image

కడప యోగి వేమన విశ్వవిద్యాలయం 2023-24 విద్యా సంవత్సరానికి యూనివర్శిటి స్థాయి జాతీయ సేవా పథక పురస్కారాలను ప్రకటించింది. సమాజ సేవా, ప్రజా చైతన్యం, జాతీయ సమైక్యత వంటి కార్యక్రమాలలో విశేష కృషిచేసిన ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు, వాలంటీర్లు, ప్రోత్సాహక అందించిన కళాశాలల జాబితాను వీసీ ప్రొ. కె.కృష్ణారెడ్డి, రిజిస్ట్రార్ ప్రొ. ఎస్. రఘునాథ రెడ్డి, ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డా.వెంకట్రామిరెడ్డి విడుదల చేశారు.

News October 1, 2024

వైవీయూ ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్‌గా ఆచార్య తప్పెట రాంప్రసాద్ రెడ్డి

image

వైవీయూ ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్‌గా తెలుగు విభాగం ప్రొఫెసర్ తప్పెట రామప్రసాద్ రెడ్డిని నియమించారు. మంగళవారం సాయంత్రం విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్‌లర్, ప్రొఫెసర్ కె. కృష్ణారెడ్డి తన ఛాంబరులో నియామక పత్రం అందజేశారు. ఇదివరకు ఈ స్థానంలో ఉన్న ఆచార్య రఘునాథరెడ్డి రిలీవ్ అయ్యి ప్రధాన ఆచార్యులుగా కొనసాగనున్నారు. నూతన రిజిస్ట్రార్‌కు బోధన, బోధ నేతర సిబ్బంది అభినందనలు తెలియజేశారు.