News April 22, 2025

కడప: బాబోయ్ అడ్మిషన్‌లా..? భయపడిపోతున్న ప్రైవేట్ టీచర్స్..!

image

కడప జిల్లాలో రాబోయే విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం ప్రైవేట్ స్కూల్ టీచర్లు పరుగులు పెడుతున్నారు. కొన్ని స్కూల్స్‌లో టార్గెట్లు ఇవ్వడంతో ఒత్తిడికి గురవుతున్నట్లు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మినిమం అడ్మిషన్లు తీసుకురావాలని హుకుం జారీ చేయడంతో మండుటెండల్లో రోడ్ల వెంట తిరుగుతున్నారు. విద్యా సంవత్సరం మారుతున్న ప్రతిసారి ఇదే పరిస్థితి అంటూ వాపోతున్నారు. మీ కామెంట్?

Similar News

News December 15, 2025

దువ్వూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

image

దువ్వూరులోని మురళి నగర్ మెట్ల సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సొంత పనులు కోసం నడుచుకుంటూ వెళుతున్న వీర ప్రతాపరెడ్డి, ఎల్లయ్య అనే వ్యక్తులను ప్రొద్దుటూరు వైపు నుంచి వస్తున్న బొలెరో వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఎల్లయ్యది నేలటూరు కాగా, వీర ప్రతాప్ రెడ్డిది గోపులాపురంగా స్థానికులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

News December 15, 2025

ఒంటిమిట్ట వద్ద ఘోర ప్రమాదం.. యువకుడి దుర్మరణం

image

మండలంలోని ఒంటిమిట్ట చెరువు కట్టపై ఆదివారం రాత్రి బైకు ఢీకొని యువకుడు మృతి చెందాడు. పోలీసుల వివరాలు మేరకు.. గోవిందమాల వేసుకొని తిరుమల పాత్ర వెళుతున్న ఎర్రగుంట్లకు చెందిన జగదీశ్(20)ని ఒంటిమిట్ట చెరువు కట్ట పైకి రాగానే రాజంపేట, బాసింగరిపల్లికి చెందిన కత్తి వెంకటేశ్(27) బైకుపై వేగంగా వచ్చి వెనుక వైపు నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరిలో జగదీశ్ చికిత్స పొందుతూ కడప రిమ్స్‌లో మృతిచెందాడు.

News December 15, 2025

కడప కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక సోమవారం కడప కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి సభా భవన్లో జరిగే కార్యక్రమానికి జిల్లా ఉన్నతాధికారులు హాజరవుతారన్నారు. అర్జీదారులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవచ్చునన్నారు. కలెక్టరేట్‌తో పాటు జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా జరుగుతుందన్నారు.