News November 27, 2024

కడప: భూ సేకరణ పనులు పూర్తిచేయాలి

image

జాతీయ రహదారుల అభివృద్ధి పనుల్లో భాగంగా జిల్లాలో చేపడుతున్న భూసేకరణ, అటవీ, పర్యావరణ అభ్యంతరాల క్లియరెన్స్ ప్రక్రియలను ఎలాంటి పెండింగ్ లేకుండా నిర్ణీత సమయం లోగా పూర్తి చేయాలని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారుల అభివృద్ధి, విస్తరణ పనులకు సంబంధించి భూ సేకరణ తదితర అంశాలపై కడప కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Similar News

News December 4, 2024

కడప జిల్లాపై లేని భూప్రకంపనల ప్రభావం

image

తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ఉదయం భూ ప్రకంపనలు రావడం సంచలనంగా మారింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఎక్కడ ప్రమాదాలు జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా ఉమ్మడి కడప జిల్లాలో ఎటువంటి ప్రకంపనలు రాకపోవడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. మన జిల్లాలో ఎక్కడైనా భూప్రకంపనల ప్రభావం ఉంటే కామెంట్ చేయండి.

News December 4, 2024

కడప జిల్లాలో 829 మంది ప్రధానోపాధ్యాయులకు నోటీసులు

image

కడప జిల్లాలో పెద్ద ఎత్తున ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖ అధికారి షోకాజ్ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. పాఠశాలల్లో పిల్లల అపార్ నమోదు పూర్తి చేయలేదని 829 మంది ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో వివరణ ఇవ్వకపోతే ప్రధానోపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారి నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో ప్రధానోపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News December 4, 2024

ప్రజా సమస్యలు పారదర్శకంగా పరిష్కరించాలి: కలెక్టర్

image

పిజిఆర్‌ఎస్‌లో వచ్చిన ప్రతి ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, పారదర్శకంగా పరిష్కరించాలని మంగళవారం అధికారులను కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. అమరావతి నుంచి సి.సి.ఎల్.ఏ.జి జయలక్ష్మి పి.జి.ఆర్.ఎస్ ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం చేయకుండా త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.