News April 15, 2025
కడప: రూ.1.8 కోట్ల విలువచేసే 602 ఫోన్ల రికవరీ

కడప జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, డేటా విశ్లేషణ పద్ధతులు ఉపయోగించి భారీగా మొబైల్ ఫోన్స్ రికవరీ చేశారు. కడపలోని ఎస్పీ ఆఫీస్ ప్రాంగణంలోని పెన్నేరు హాల్‌లో ఎస్పీ అశోక్ కుమార్ మొబైల్ ఫోన్లను బాధితులకు అప్పగించారు. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సుమారు రూ.1.8 కోట్ల విలువచేసే 602 మొబైల్ ఫోన్లు రికవరీ చేశామన్నారు.
Similar News
News April 16, 2025
రెవెన్యూ సేవల్లో వేగం, నాణ్యత ముఖ్యం: కలెక్టర్

రెవెన్యూ అధికారులు అన్ని రకాల ప్రభుత్వ ఉత్తర్వులు (జీవోలు), చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. బుధవారం కడప కలెక్టరేట్లోని సభా భవనంలో వివిధ రెవెన్యూ అంశాలపై ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. రెవెన్యూ సేవల్లో వేగం, నాణ్యత ముఖ్యం అన్నారు. అధికారులు తమ పనితీరును మెరుగుపరుచుకుని, మరింత బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో పనిచేయాలని సూచించారు.
News April 16, 2025
అట్లూరు: ఈతకు వెళ్లి బాలిక మృతి

అట్లూరు మండలం కమలకురులో ఈతకు వెళ్లి 15 ఏళ్ల తేజ మృతి చెందిన విషయం తెలిసిందే. తేజ నడుముకు కట్టుకున్న ప్లాస్టిక్ వస్తువు జారిపోవడంతో నీటిలో కొట్టుకుపోయినట్లు స్థానికులు తెలిపారు. బాలిక తండ్రి జీవనోపాధి కోసం కువైట్‌కు వెళ్లారు. పాప మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News April 15, 2025
కడప: బిల్టప్ సర్కిల్‌లో దారుణ హత్య

కడప నగరంలోని బిల్టప్ సర్కిల్‌లో ఇవాళ దారుణ హత్య జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. సాదిక్ అనే రవీంద్రనగర్‌కు చెందిన యువకుడు తన వ్యక్తిగత పని నిమిత్తం బయటకు వచ్చినప్పుడు కొందరు గుర్తు తెలియని దుండగులు ఆయన మీద మారణాయుధాలతో దాడి చేసి హత్య చేసినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.