News February 7, 2025

కడప: రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు

image

రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఇవాళ తెల్లవారుజామున ‘స్టాప్, వాష్ అండ్‌ గో’ కార్యక్రమం నిర్వహించారు. రహదారులపై వెళ్తున్న లారీలు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు డ్రైవర్లకు ఆపి ముఖాలు కడుక్కుని వెళ్ళమని సూచించారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఈ కార్యక్రమం చేస్తున్నామన్నారు.

Similar News

News February 7, 2025

DAY 5: కడప కలెక్టర్‌ను కలిసిన విద్యార్థులు

image

ప్రొద్దుటూరు మండలం గోపవరం పశు వైద్య కళాశాల విద్యార్థుల నిరసన ఐదో రోజుకు చేరింది. ఇవాళ వెటర్నరీ విద్యార్థులు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరిని, అలాగే కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డిని కలిసి తమ సమస్యలు తెలుపుకున్నారు. తమ డిమాండ్లను వారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. వీలైనంత త్వరగా తమకు స్టైఫండ్ ఇప్పించాలని కోరారు. లేదంటే చలో అమరావతి నిర్వహిస్తామని విద్యార్థులు హెచ్చరించారు.

News February 7, 2025

కడప: విచారణ అధికారి ఎదుట హాజరైన దస్తగిరి

image

తనని జైలు సూపరింటెండెంట్ ప్రకాశ్ ఇబ్బంది పెట్టారని మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు అప్రూవర్ దస్తగిరి ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కడప జైలులో ఇవాళ విచారణ అధికారి రాహుల్ శ్రీరాం ఎదుట దస్తగిరి హాజరయ్యారు. ఫిర్యాదులో డాక్టర్ చైతన్య రెడ్డి తనని ప్రలోభపెట్టడానికి ప్రయత్నించాడని పేర్కొన్నారు. దస్తగిరి తర్వాత చైతన్య, ప్రకాశ్ విచారణకు హాజరుకానున్నారు.

News February 7, 2025

పులివెందుల: రాజహంస వాహనంపై శ్రీనివాసుడు

image

శ్రీ వెంకటరమణుడి బ్రహ్మోత్సవాలలో భాగంగా పులివెందులలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం రాత్రి రాజ హంస వాహనంపై సరస్వతీ రూపంలో శ్రీనివాసుడు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి కాయ కర్పూరం సమర్పించి దర్శించుకున్నారు. అనంతరం అర్చకులు భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

error: Content is protected !!