News April 3, 2025

కడప వాసులకు గర్వకారణం: తులసిరెడ్డి

image

కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గాలి నాణ్యత నివేదికలో కడప నగరం మొదటి స్థానంలో ఉండటం హర్షణీయమని రాజ్యసభ మాజీ సభ్యులు తులసి రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గురువారం ఆయన వేంపల్లిలో మాట్లాడారు. 42 పాయింట్లతో, కడప నగరం రాష్ట్రంలో అత్యంత క్లీన్ ఎయిర్ నగరంగా ఎంపిక కావటం సంతోషమన్నారు, ఇది కడప వాసులకు గర్వకారణమన్నారు. 52 పాయింట్లతో నెల్లూరు, 120 పాయింట్లతో విశాఖ చివరి స్థానంలో ఉండటం దారుణం అన్నారు.

Similar News

News April 10, 2025

జమ్మలమడుగు: అది ప్రమాదం కాదు.. హత్యే.!

image

జమ్మలమడుగు-ముద్దనూరు రోడ్డులో మార్చి 24న ప్రమాదంలో గుడెంచెరువుకు చెందిన కిశోర్ బాబు మృతిచెందాడు. ఈ యాక్సిడెంట్‌ను పక్కా ప్లాన్‌తో ఉదయ్ కుమార్ చేశాడని CI లింగప్ప బుధవారం తెలిపారు. మార్చి 20న కిశోర్ బాబు మేనమామ కిరణ్ తల్లి దినం కార్యక్రమంలో ఉదయ్ కుమార్ భార్యను కిశోర్ కొట్టాడని వాగ్వాదానికి దిగాడు. దీంతో అతడిని ఎలాగైనా చంపాలని పక్కాప్లాన్‌తో యాక్సిడెంట్ చేశాడని CI తెలిపారు.

News April 9, 2025

ఒంటిమిట్ట కళ్యాణ వేడుక ఏర్పాట్ల పరిశీలన

image

11వ తేదీన జరగబోయే ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముని కళ్యాణం వేడుకకు సంబంధించి పటిష్టమైన ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు ఒంటిమిట్ట కళ్యాణ వేదిక ప్రాంగణాన్ని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి పరిశీలించారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులు సిబ్బందికి కలెక్టర్ సూచించారు.

News April 9, 2025

చివరికి న్యాయమే గెలిచింది: మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా

image

చివరికి న్యాయమే గెలిచిందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా తెలిపారు. తన సోదరుడు అంజద్ బాషా కడపలోని సెంట్రల్ జైలు నుంచి విడుదలైన సందర్భంగా అంజాద్ అంజద్ బాషా మాట్లాడారు. చివరి వరకు న్యాయస్థానాన్ని నమ్మామన్నారు. న్యాయమే గెలిచి నా సోదరుడు అహ్మద్ అంజద్ బాషాకి బెయిల్ వచ్చిందన్నారు. కష్టకాలంలో తోడున్న వైసీపీ కార్యకర్తలకి, ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.

error: Content is protected !!