News August 8, 2024
కడప: హెల్మెట్ ధరించండి.. ప్రమాదాలను నివారించండి
హెల్మెట్ ధరించండి.. ప్రమాదాలు నివారించండని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీదేవి, సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి ఎస్.బాబా ఫక్రుద్దీన్ తెలిపారు. బుధవారం కడప జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వివిధ వర్గాల వారికి ఉచితంగా 1700 హెల్మెట్లను పంపిణీ, 50 వీల్ ఛైర్లను పంపిణీ చేశారు. కలెక్టర్ శివశంకర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు పాల్గొన్నారు.
Similar News
News November 18, 2024
కడప: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) వికేంద్రీకరణ
ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS)ను ఈ సోమవారం నుంచి మండల, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు మండల, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తామని కలెక్టర్ అన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలలోనే ఇవ్వాలని సూచించారు.
News November 17, 2024
కడప: ఇంకా లభ్యంకాని గల్లంతైన యువకుడి ఆచూకీ
కడప జిల్లా వల్లూరు మండలంలోని పుష్పగిరి పుణ్యక్షేత్రం వద్ద శుక్రవారం పెన్నానది నీటిలో గల్లంతైన గణేశ్ అనే యువకుడి కోసం శనివారం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు, బంధువులు, రెస్క్యూ టీంతోపాటు జాలర్ల ద్వారా ట్యూబులు, రబ్బరు బోటు సహాయంతో నది వెంబడి గాలింపు చర్యలు చేపట్టారు. నేటికి కూడా యువకుడికి సంబంధించి ఎలాంటి ఆచూకీ లభించలేదు.
News November 17, 2024
పులివెందుల: ప్రేమ పేరుతో ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం
ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఘటన పులివెందులలో చోటుచేసుకుంది. పులివెందుల పరిధిలోని ప్రశాంతి నగర్‌కు చెందిన యస్వంత్ సమీప కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థినిని ప్రేమ పేరుతో మోసం చేశాడు. పెళ్లి చేసుకోమంటే కులం పేరుతో దూషిస్తున్నాడని పులివెందుల అర్బన్ పోలీసులను యువతి ఆశ్రయించింది. అనంతరం అతనిపై SC, ST అట్రాసిటీ కేసు పెట్టింది.