News June 19, 2024

కడపలో పోలీసుల పై కరపత్రాల కలకలం

image

కడప నగరంలో ఓ పోలీస్ స్టేషన్‌లో పోలీసు అధికారులు సార్వత్రిక ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన వారి నుంచి డబ్బులను తీసుకుని సిబ్బందికి పంపిణీ చేయకుండా అవినీతికి పాల్పడ్డారంటూ గుర్తు తెలియని వ్యక్తులు ‘కరపత్రాలు’ ముద్రించి రాత్రి వేళల్లో పంపిణీ చేశారు. ఈ సంఘటన పోలీసు అధికారుల్లో అసహనం, ప్రజల్లో కలకలం రేపింది. ఈ సంఘటనపై ఎవరు కరపత్రాలను తయారు చేశారు? ఎవరు పంపిణీ చేశారు? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.

Similar News

News October 4, 2024

కమలాపురం: భూ తగాదాల్లో తోపులాట.. వ్యక్తి మృతి

image

కమలాపురం మండల పరిధిలోని అప్పారావుపల్లెలో భూ తగాదాల కారణంగా ఇరు వర్గాల మధ్య గురువారం రాత్రి ఘర్షణ జరిగింది. ఈ తోపులాటలో శీలం కృష్ణారెడ్డి (65) మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. బావా బామర్దుల మధ్య భూమి విషయంలో జరిగిన వాదనలు తోపులాటకు దారితీశాయి. ఈ సందర్భంలో కృష్ణారెడ్డికి ఒక్కసారిగా చాతినొప్పి రావడంతో కిందపడ్డారు. వెంటనే కమలాపురం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

News October 4, 2024

కడప: కుడా వైస్ ఛైర్మన్‌గా అదితి సింగ్

image

కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) వైస్ ఛైర్మన్‌గా ప్రస్తుత కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్‌ను నియమిస్తూ.. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదివరకు వైస్ ఛైర్మన్‌గా ఉన్న వైఓ నందన్ సీడీఎంఏ డీడీగా బదిలీ అయిన నేపథ్యంలో ప్రభుత్వం జేసీకి ఇన్‌ఛార్జి వైస్ ఛైర్మన్ బాధ్యతలను అప్పగించారు.

News October 4, 2024

కడప: ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో నేరుగా అడ్మిషన్లు

image

వైవీయూ పీజీ కళాశాలలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో నేరుగా ప్రవేశాలు (ఏ.పి.ఐ.సి.ఈ.టి-2024) కల్పిస్తున్నట్లు విశ్వవిద్యాలయ ప్రవేశాల సంచాలకులు డాక్టర్ లక్ష్మీప్రసాద్ తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు విశ్వవిద్యాలయంలోని ఏపీజే అబ్దుల్ కలాం గ్రంథాలయ ప్రాంగణంలోని డీఓఏ కార్యాలయంలో ఈ నెల 4 నుంచి 7వ తేదీ వరకు జరిగే కౌన్సెలింగ్‌‌కు హాజరు కావాలన్నారు. విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, రుసుంతో రావాలన్నారు.