News April 24, 2024
కడియం కావ్య ఆస్తులు రూ.1.55 కోట్లు
వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య సోమవారం నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. అఫిడవిట్లో పొందుపర్చిన ఆస్తుల వివరాలు.. కావ్యకు రూ.1.55 కోట్ల ఆస్తులు ఉండగా.. సొంతంగా ఇళ్లు, వ్యవసాయ భూములు లేవు. ఆమెతో పాటు తన భర్త మహ్మద్ నజీరుల్లా షేక్ వద్ద రూ.1.15 లక్షల నగదు ఉంది. ఇన్నోవా క్రిస్టా, రాయల్ ఎన్ఫీల్డ్, హోండా యాక్టివా ఉన్నాయి. ఇరువురి వద్ద 27 తులాలు, పిల్లల నేరిట 8 తులాల బంగారం ఉంది.
Similar News
News January 7, 2025
వరంగల్లో ఎక్కువ, ములుగు జిల్లాలో తక్కువ
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 30,43,540 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించింది. అయితే మగవారితో పోలిస్తే మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. HNK(D) 5,08,618, WGL(D) 7,73,453, జనగామ(D) 7,62,106, MHBD(D) 4,85,692, BHPL(D) 2,78,185, ములుగు(D) 2,35,486 మంది ఓటర్లు ఉన్నారు. WGL జిల్లాలో ఎక్కువ, ములుగులో తక్కువ మంది ఓటర్లు ఉన్నారు.
News January 7, 2025
వరంగల్: ఎయిర్పోర్టు కోసం స్థల పరిశీలన
మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కావాల్సిన నిధులను, జీవోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విమానాశ్రయం నిర్మాణానికి కావాల్సిన భూమిని అధికారులు సోమవారం పరిశీలించారు. ఖిలా వరంగల్ తహశీల్దార్ బండి నాగేశ్వర్ రావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆనందం, కీర్తన్, సర్వేయర్ రజిత, ఏఈఈ రాజ్ కుమార్ తదితరులున్నారు.
News January 6, 2025
HNK: సిద్దేశ్వరుడికి ప్రత్యేక అలంకరణ
హనుమకొండ జిల్లా కేంద్రంలోని సిద్దేశ్వరాలయంలో సోమవారం సిద్దేశ్వరుడికి ప్రత్యేక అలంకరణ, పూజా కార్యక్రమాలను చేపట్టారు. పలువురు భక్తులు సిద్దేశ్వరుడిని దర్శించుకుని మొక్కులను చెల్లించుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు లేకుండా అర్చకులు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని పలు ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది.