News April 13, 2025
కడెం: ఉరేసుకొని యువతి ఆత్మహత్య

ఉరివేసుకొని యువతి మృతి చెందిన ఘటన కడెం మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై కృష్ణసాగర్‌రెడ్డి కథనం ప్రకారం.. మండలంలోని మర్రిగూడెం గ్రామానికి చెందిన అనూషను(21) శుక్రవారం సాయంత్రం ఓ విషయంలో తల్లి మందలించింది. మనస్తాపానికి గురై ఇంటి పక్కన ఉన్న షెడ్డులో ఉరేసుకుంది. అనూష తండ్రి రాజేశ్వర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 15, 2025
NGKL: సళేశ్వరం జాతరకు 3 లక్షలకు పైగా భక్తులు..!

నాగర్ కర్నూల్ జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న సళేశ్వరం ఉత్సవాలకు మూడు రోజుల్లో దాదాపు 3 లక్షలకు పైగానే భక్తులు హాజరైనట్లు అధికారులు అంచనా వేశారు. ఈనెల 11 నుంచి 13 వరకు సళేశ్వరం ఉత్సవాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి లింగామయ్యను దర్శించుకున్నారు. నల్లమల అటవీ ప్రాంతం భక్తుల తాకిడికి దద్దరిల్లిపోయింది. వరుసగా రెండు రోజులు ట్రాఫిక్ జామ్ అయింది.
News April 15, 2025
గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో పవన్, బాలయ్య సినిమాలు!

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో మరో మూవీ రాబోతున్నట్లు తెలుస్తోంది. వీరి కాంబోలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ బ్లాక్ బస్టర్‌గా నిలువగా మరోసారి యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్టైనర్‌తో రాబోతున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతుండగా ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభం కానుంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో పక్కా యాక్షన్ ఫిల్మ్ తీసేందుకు చర్చలు జరుపుతున్నారు. ఇది 2026లో స్టార్ట్ అవ్వొచ్చని టాక్.
News April 15, 2025
రాబర్ట్ వాద్రాకు మరోసారి ఈడీ నోటీసులు

కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు మనీ లాండరింగ్ కేసులో ఈడీ మరోసారి నోటీసులు పంపింది. హరియాణాలోని శిఖోపూర్ భూముల వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న ఈడీ ఈనెల 8న విచారణకు హాజరు కావాలని వాద్రాకు సమన్లు జారీ చేసింది. వాటికి ఆయన స్పందించకపోవడంతో మళ్లీ నోటీసులు పంపింది. ఆ భూముల వ్యవహారంలో వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ సంస్థ అక్రమాలకు పాల్పడిందన్న ఆరోపణలున్నాయి.