News February 9, 2025
కడెం: పురుగు మందు తాగి వ్యక్తి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739020334456_51420205-normal-WIFI.webp)
కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి మనస్థాపం చెంది పురుగు మందు తాగి మృతి చెందిన ఘటన కడెం మండలంలో చోటుచేసుకుంది.ఎస్సై కృష్ణసాగర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ..లక్ష్మీసాగర్ గ్రామానికి చెందిన కొత్తూరు శంకర్(43) భూముల పంపకాల విషయంలో గొడవ జరుగగా మనస్థాపం చెందాడు. దీంతో ఈనెల 7న పురుగుల మందు సేవించాడు.ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా శనివారం మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.
Similar News
News February 9, 2025
బాపట్ల జిల్లా ప్రజలు జాగ్రత్త..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739076344102_928-normal-WIFI.webp)
బాపట్ల జిల్లాలో వాతావరణం మారుతోంది. వారంక్రితం వరకు జిల్లాను చలి వణికించింది. తాజాగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి తొలివారంలోనే మే నెలను తలపించేలా ఎండ కాస్తోంది. ఉదయం 10గంటల నుంచే సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. నిన్న బాపట్ల జిల్లాలో గరిష్ఠంగా 33.2డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు బయటకు వెళ్లినప్పుడు జాగ్రత్తలు పాటించాలని ఎక్కువగా నీరు, కొబ్బరి నీళ్లు తాగాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
News February 9, 2025
పోక్సో కేసులో విశాఖ సెంట్రల్ జైలుకు టీచర్: ఎస్ఐ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739076290433_697-normal-WIFI.webp)
ఇటీవల వడ్డాదిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన టీచర్ గంగా ప్రసాద్‌పై <<15378554>>పోక్సో కేసు <<>>నమోదు చేసినట్లు బుచ్చయ్యపేట ఎస్ఐ ఏ.శ్రీనివాసరావు తెలిపారు. చోడవరం కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించారన్నారు. నిందితుడిని విశాఖ సెంట్రల్ జైలుకు తరలించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ ఘటనపై హోం మంత్రి అనిత, ప్రజాసంఘాలు స్పందించిన విషయం తెలిసిందే.
News February 9, 2025
అనంత: చొక్కాపై పేర్లు రాసుకుని వ్యక్తి సూసైడ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739020889102_20051091-normal-WIFI.webp)
ఉరవకొండలోని చంగల వీధికి చెందిన కిశోర్(33) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు కొందరు వ్యక్తులు కారణం అంటూ వారి పేర్లను చొక్కాపై రాసుకున్నాడు.ఇంట్లో ఉరివేసుకున్న విషయం గమనించిన కుటుంబ సభ్యులు కిశోర్‌ను ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అప్పుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.