News December 15, 2024
కడ్తాల్ మహా పిరమిడ్‌లో 21 నుంచి ధ్యాన మహా యాగం
కడ్తాల్ మండలం హనుమాస్‌పల్లి గ్రామంలోని మహేశ్వర మహా పిరమిడ్‌లో ఈ నెల 21 నుంచి 31 వరకు ధ్యాన మహాయాగం నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. 11 రోజులపాటు ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ధ్యానం, శాకాహార ప్రచారం కోసం నిర్వహిస్తున్న యాగంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. ట్రస్టు సభ్యులు మాధవి, శ్రీరామ్ గోపాల్, హనుమంత రాజు, రాంబాబు, సాంబశివరావు, నిర్మల దేవి, లక్ష్మి పాల్గొన్నారు.
Similar News
News January 18, 2025
HYD: ఇంటర్ విద్యార్థుల ALERT.. ఈనెల 25 వరకు అవకాశం
ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులను ఇంటర్మీడియట్ బోర్డు అప్రమత్తం చేసింది. వార్షిక పరీక్షలకు సంబంధించిన ఫీజును ఇప్పటికీ చెల్లించని విద్యార్థులు.. ఆలస్య రుసుం రూ. 2500తో జనవరి 25 వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. ఇంటర్ రెగ్యులర్, వొకేషనల్ విద్యార్థులతో పాటు ప్రైవేటు విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.
News January 18, 2025
HYD: రాష్ట్రంలో రేవంత్ దోపీడీ ముఠా: కేటీఆర్
రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన దోపీడీ ముఠా రాష్ట్రంలో తిరుగుతుందని మాజీమంత్రి కేటీఆర్ ఆరోపించారు. ప్రగతి భవన్‌లో చిట్ చాట్‌లో KTR మాట్లాడుతూ.. రేవంత్ సోదరులతో పాటు ఆరుగురి టీం కంపెనీల నుంచి వసూళ్ల కోసం రేవంత్ రెడ్డి తిప్పుతున్నాడని అన్నారు. తిరుపతిరెడ్డి, కొండల్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రోనిన్ రెడ్డి, ఫహీం ఖురేషి, ఏవి రెడ్డితో కూడిన ఆలీబాబా అర డజన్ దొంగల గ్యాంగ్ తెలంగాణలో తిరుగుతుందని అన్నారు.
News January 17, 2025
రంగారెడ్డి : హైదరాబాద్‌లో తగ్గిన వాయు కాలుష్యం
సంక్రాంతి పండగ నేపథ్యంలో హైదరాబాద్ వాసులంతా సొంతూళ్లకు వెళ్లారు. దీంతో నగరంలో వాయు కాలుష్యం తగ్గుముఖం పట్టిందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా నివాస వాణిజ్య ప్రాంతాల్లో కాలుష్య కారకాలు గణనీయంగా తగ్గిపోగా.. పారిశ్రామిక వాడల్లో మాత్రం కాస్త అధికంగా నమోదైందన్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగ ముగియడంతో మళ్లీ హైదరాబాదులో కాలుష్యం గణనీయంగా పెరిగిపోతుందని అధికారులు పేర్కొన్నారు.