News April 1, 2025
కనగానపల్లిలో ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

కనగానపల్లి మండలం తగరకుంటకు చెందిన ఓబిరెడ్డి (32) మంగళవారం తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి ఓబిరెడ్డిని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ఓబిరెడ్డి ఎంబీఏ చదివి వ్యవసాయం చేస్తుంటాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై కనగానపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News April 3, 2025
సీడ్స్ సంస్థను సందర్శించిన జిల్లా కలెక్టర్

దుత్తలూరులోని సీడ్స్ ఉపాధి శిక్షణ సంస్థను కలెక్టర్ ఓ.ఆనంద్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా సంస్థలో జరుగుతున్న కార్యక్రమాలు, అందిస్తున్న సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కుట్టు శిక్షణ, నైపుణ్య శిక్షణ, వ్యవసాయం, కంటి పరీక్షలు తదితర వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు ఈ సంస్థ సేవలందిస్తుందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
News April 3, 2025
ఎల్లుండి విద్యార్థుల తల్లిదండ్రుల మహా ధర్నా!

CBSE పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నారు. ఈక్రమంలో ధర్నా చౌక్ వద్ద ఎల్లుండి మహా ధర్నా చేపట్టనున్నారు. ‘ఈ నిర్ణయంతో బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతాయి. దశలవారీగా తెలుగును మూడో భాషగా ప్రవేశపెట్టాలి. సెకండ్ ల్యాంగ్వేజ్‌ను ఎంచుకునే స్వేచ్ఛ ఇవ్వాలి’ అని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
News April 3, 2025
కోర్టులపై నమ్మకం ఉంది.. ఆదేశాలు పాటిస్తాం: భట్టి

TG: గచ్చిబౌలి కంచ భూములపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై డిప్యూటీ CM భట్టి విక్రమార్క స్పందించారు. ఈ అంశంలో సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తామని వెల్లడించారు. కోర్టు అడిగిన సమాచారాన్ని గడువులోగా పంపిస్తామని తెలిపారు. కోర్టులపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, న్యాయం గెలుస్తుందని చెప్పారు. అటు ఈ భూముల కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరించొద్దని పోలీసులను ఆదేశించినట్లు భట్టి వివరించారు.