News April 6, 2025
కనిగిరి: కారుణ్య ఉద్యోగ నియామక పత్రం అందజేసిన ఎమ్మెల్యే ఉగ్ర

మిట్టపాలెం శ్రీ నారాయణ స్వామి వారి దేవస్థానం ప్రధాన అర్చకుడు సత్యనారాయణ శర్మ ఇటీవల మృతి చెందారు. ఆయన కుమారుడు నారాయణ స్వామికి దేవస్థానంలో జూనియర్ అసిస్టెంట్‌గా కారుణ్య నియామకం కింద ఉద్యోగం లభించింది. శనివారం నియామక ఉత్తర్వులు కనిగిరిలో MLA ఉగ్ర నరసింహ రెడ్డి నారాయణస్వామికి అందజేశారు. కార్యక్రమంలో నారాయణస్వామి ఆలయ ఈవో నరసింహ బాబు పాల్గొన్నారు.
Similar News
News April 12, 2025
ప్రకాశం జిల్లాకు 16వ స్థానం

ఇంటర్ ఫలితాల్లో ప్రకాశం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 16236 మంది పరీక్షలు రాయగా.. 12863 మంది పాసయ్యారు. 79 శాతం పాస్ పర్సంటేజీతో ప్రకాశం జిల్లా రాష్ట్రంలోనే 16వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఇయర్‌లో 18715 మందికి, 11798 మంది పాసయ్యారు. 63 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 19వ స్థానంలో ప్రకాశం జిల్లా నిలిచింది.
News April 12, 2025
మార్కాపురం తహశీల్దార్‌కి ప్రమాదం

ప్రకాశం జిల్లా మార్కాపురం తహశీల్దారు చిరంజీవికి పెను ప్రమాదం తప్పింది. శనివారం ఉదయం స్వయంగా తానే కారు నడుపుతూ మార్కాపురం నుంచి ఒంగోలు వెళ్తుండగా.. పొదిలి సమీపంలో ఎదురుగా వచ్చే వాహనాన్ని తప్పించబోయి కారు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో తహశీల్దార్ చిరంజీవికి స్వల్ప గాయాలయ్యాయి. కాగా ఈ ప్రమాదంలో కారు ధ్వంసం అయింది.
News April 12, 2025
ప్రకాశం: ఇంటర్ ఫలితాలు.. మీ Way2Newsలో

ప్రకాశం జిల్లాలో ఇంటర్ ఫలితాలు ఉదయం 11 గంటలకు రానున్నాయి. ప్రకాశం జిల్లాలో మొత్తం 67 పరీక్షా కేంద్రాల్లో 42,439 మంది పరీక్షలు రాశారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 21,624 మంది కాగా, సెకండియర్ విద్యార్థులు 20,815 మంది ఉన్నారు. వీరి భవితవ్యం శనివారం తేలనుంది.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.