News April 19, 2024
కనిగిరి: బైకుపై నుంచి పడి వ్యక్తి మృతి

కనిగిరి మండలంలోని సుల్తానపురానికి చెందిన లక్కిరెడ్డి పెద్ద అంజయ్య (56) శుక్రవారం మృతి చెందారు. మాచవరం వద్ద బైకుపై నుంచి ప్రమాదవశాత్తు పడి తీవ్ర గాయాలయ్యాయి. ఎన్నికల నిమిత్తం అటుపై వెళ్తున్న సీఐ రామనాయక్ స్పందించి పెద్ద అంజయ్యను తన వాహనంలో కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. హాస్పిటల్ కి వచ్చిన కొద్దిసేపు తర్వాత పెద్ద అంజయ్య మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.
Similar News
News April 23, 2025
ప్రకాశం జిల్లా 10వ తరగతి పరీక్షల సమాచారం

పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ ఉదయం 10 గంటలకు మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ప్రకాశం జిల్లాలో 29,602 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరిగాయి.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
News April 22, 2025
యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వినతి

యానాదుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి చెప్పారు. టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో యానాది సంఘం ప్రతినిధులు మంత్రిని కలిశారు. యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రిమిటివ్ ట్రైబల్ జాబితాలో తమను చేర్చాలని కోరారు. జనాభా దామాషా ప్రాతిపదికన చట్టసభల్లో యానాది సామాజిక వర్గానికి ప్రాధాన్యతివ్వాలని వినతిపత్రం అందజేశారు.