News April 13, 2025
కన్నెపల్లి: ప్రభుత్వ భూమి కబ్జా.. ఏడుగురి అరెస్ట్

కన్నెపల్లి మండలం రెబ్బల గ్రామ శివారులో S.No248 లోని ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు SI గంగారం తెలిపారు. మండల తహశీల్దార్ ఫిర్యాదు మేరకు చేసిన విచారణలో ఎలాంటి అనుమతులు లేకుండా ప్రవేశించి ఆ భూమిలో చెట్లను నరికివేశారన్నారు. దీంతో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు.
Similar News
News April 15, 2025
NGKL: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన నిన్న జరిగింది. స్థానికుల వివరాలు.. MBNRకి చెందిన రాజగోపాల్‌సింగ్(54) వెల్దండ మండలంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో శుభకార్యానికి హాజరయ్యారు. HYD-శ్రీశైలం జాతీయ రహదారి దాటుతుండగా.. కల్వకుర్తి నుంచి HYD వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఆయనను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందారు. కేసు నమోదైంది.
News April 15, 2025
TCSలో 42వేల మంది ప్రెషర్లకు ఉద్యోగాలు!

ఈ ఆర్థిక సంవత్సరంలో 42వేల మంది ప్రెషర్లకు ఉద్యోగాలు ఇవ్వాలని టీసీఎస్ నిర్ణయించినట్లు సమాచారం. 2024-25 మాదిరిగానే రిక్రూట్‌మెంట్ ఉంటుందని తెలుస్తోంది. నేషనల్ క్వాలిఫయర్ టెస్టులో ప్రతిభ చూపిన వారిని ప్రైమ్, డిజిటల్, నింజా విభాగాల్లో నియమించుకోనుంది. కాగా FY2024-25 చివరికి 6,07,979 మంది ఉద్యోగులు TCSలో ఉన్నారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 6,433 మంది మాత్రమే పెరిగారు.
News April 15, 2025
ఈనెల 22న టెన్త్ ఫలితాలు విడుదల?

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాల విడుదలకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 3 నుంచి 9 వరకు జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేశారు. ప్రస్తుతం మార్కులను ఆన్‌లైన్‌లో ఎంటర్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 22న రిజల్ట్స్ ప్రకటించే అవకాశముంది. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగిన పరీక్షలకు దాదాపు 6.50L మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా ఇటీవల ఇంటర్ ఫలితాలను వెల్లడించిన విషయం తెలిసిందే.