News March 26, 2025
కన్నేపల్లిలో ముగ్గురు అరెస్ట్.. ఏడుగురు పరారీ

కన్నేపల్లి మండలం ముత్తాపూర్ గ్రామ శివారులో పేకాట స్థావరంపై దాడులు నిర్వహించినట్లు ఎస్ఐ గంగారాం తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు గ్రామ శివారులో పేకాట స్థావరంపై దాడి చేసి పేకాట ఆడుతున్న ముగ్గురు జూదరులను అరెస్ట్ చేశామని, మరో ఏడుగురు పారిపోయినట్లు వెల్లడించారు. వారి వద్ద రూ.1500 నగదు, 2ఆటోలు, 2 బైకులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News March 31, 2025
కార్యకర్తలే టీడీపీకి అధినేతలు: లోకేశ్

టీడీపీకి కార్యకర్తలే అధినేతలని మంత్రి నారా లోకేశ్ అన్నారు. అచ్యుతాపురంలో సోమవారం పార్టీ కార్యకర్తల సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసికట్టుగా పోరాటం చేసి చరిత్రను తిరిగి రాశారని తెలిపారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పార్టీ ఇన్‌ఛార్జ్‌లు వారానికి ఒకరోజు పార్టీ కార్యకర్తలను కలిసి సమస్యలను పరిష్కరించాలన్నారు.
News March 31, 2025
‘ఎంపురాన్’పై తమిళనాట వివాదం.. రైతుల ధర్నా

మోహన్‌లాల్ ‘ఎంపురాన్’ సినిమా మరో వివాదంలో చిక్కుకుంది. ఆ మూవీలో ముళ్లై పెరియార్ డ్యామ్ గురించి తీసిన సన్నివేశాల్ని తొలగించాలని తమిళనాడు రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సినిమాపై నిరసనగా వచ్చే నెల 2న కేరళ, తమిళనాడు సరిహద్దుల్లో ధర్నాలు చేపడతామని ప్రకటించాయి. కాగా.. ఓ వర్గాన్ని కించపరిచేలా కొన్ని సీన్స్ ఉన్నాయంటూ ఇప్పటికే ఆ సినిమాపై విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే.
News March 31, 2025
మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన రంజాన్ : VZM SP

విజయనగరం జిల్లాలో రంజాన్ పండగ హిందూ – ముస్లిం సోదరుల మధ్య సోదర భావం పెల్లుబికి, పండగలో ఎటువంటి మత విద్వేషాలు, సంఘర్షలు, అల్లర్లు జరగకుండా ప్రశాంతయుతంగా ముగిసినట్లుగా ఎస్పీ వకుల్ జిందాల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రంజాన్ పర్వదినాన జిల్లాలో ఎటువంటి మత ఘర్షణలు తలెత్తకుండా జిల్లా పోలీసుశాఖ చేపట్టిన ముందస్తు భద్రత చర్యలు సత్ఫలితాలనిచ్చాయని అన్నారు.