News February 7, 2025
కమర్షియల్ షాపులకు ఆన్‌లైన్ ద్వారా టెండర్ల ఆహ్వానం
ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజియన్ భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు పరిధిలో ఉన్న కమర్షియల్ షాప్‌లకు ఆన్లైన్ విధానంలో టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా TGSRTC DY.RM(O) G.N పవిత్ర తెలిపారు. ఆసక్తి గలవారు ఫిబ్రవరి 24 వరకు అధికారిక వెబ్ సైట్ Tgsrtc.telanagana.gov.in (Tenders)లో టెండర్‌కు దరఖాస్తు చేసుకువాలన్నారు.
Similar News
News February 7, 2025
సెలవు ఇవ్వలేదని…
ఆఫీస్‌లో సెలవు ఇవ్వలేదని నలుగురు సహోద్యోగులను పొడిచిన ఘటన బెంగాల్‌లోని కోల్‌కతాలో జరిగింది. అమిత్ కుమార్ సర్కార్ విద్యాశాఖలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. నిన్న అతడు లీవ్ కోసం అప్లై చేయగా రిజెక్ట్ అయింది. ఈ విషయంపైనే తోటి ఉద్యోగులతో వాగ్వాదానికి దిగిన అతడు కత్తితో నలుగురిపై దాడి చేశాడు. అనంతరం కత్తి, రక్తం మరకలతో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు అరెస్ట్ చేశారు.
News February 7, 2025
ఆపరేషన్ టైగర్: శిండే గూటికి ఠాక్రే ఎంపీలు!
మహారాష్ట్రలో ‘ఆపరేషన్ టైగర్’ హాట్‌టాపిక్‌గా మారింది. ఉద్ధవ్ ఠాక్రే SSUBT 9 మంది ఎంపీల్లో ఆరుగురు శిండే శివసేనలో చేరబోతున్నారని సమాచారం. ఇప్పటికే చర్చలు ముగిశాయని, వచ్చే పార్లమెంటు సెషన్‌లోపు వీరు చేరడం ఖాయమేనని తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్రాల్లో NDA అధికారంలో ఉండటం, ఐదేళ్ల వరకు నిధులు లేకుండా మనుగడ కష్టమవ్వడమే ఇందుకు కారణాలని టాక్. 2/3 వంతు MP/MLAలు మారితే పార్టీ మార్పు నిరోధక చట్టం వర్తించదు.
News February 7, 2025
వైభవంగా మహా కుంభాభిషేకం ప్రారంభం
కాళేశ్వర క్షేత్రంలో మహా కుంభాభిషేకం వైభవంగా ప్రారంభమైంది. వేద పండితులు అచలాపురం రిత్వికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య అత్యంత అరుదైన ఘట్టానికి శ్రీకారం జరిగింది. కుంభాభిషేక కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశామని, భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని, ముందుకు సాగే విధంగా కార్యాచరణను అధికారులు రూపొందించారు.