News April 11, 2024
కరకగూడెం: రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఇద్దరికి గాయాలు

కరకగూడెం మండలం బంగారు గూడెం గ్రామంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ద్విచక్ర వాహనాలు గ్రామంలోని ప్రధాన రహదారిపై ఎదురెదురుగా ఢీకొనడంతో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉంది. క్షతగాత్రులు తోగ్గూడెం గ్రామానికి చెందిన వారిగా స్థానికులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 21, 2025
ఖమ్మం: భానుడి ప్రతాపం.. ఆ మండలాల్లోనే టాప్.!

ఖమ్మం జిల్లాలో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. ఆదివారం చింతకాని, ముదిగొండ (పమ్మి), (బాణాపురం)లో అత్యధికంగా 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అటు కారేపల్లి, కామేపల్లి(లింగాల), వైరాలో 42.7, ఎర్రుపాలెం 42.6, కూసుమంచి 42.1, మధిర 42.0, పెనుబల్లి, నేలకొండపల్లి 41.7, రఘునాథపాలెం 41.6, ఖమ్మం (U) 41.4, ఖమ్మం (R) పల్లెగూడెం, తిరుమలాయపాలెం (బచ్చోడు) 41.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
News April 20, 2025
KMM: పేరెంట్స్ మందలించారని యువకుడి SUICIDE

తల్లిదండ్రులు మందలించారని కుమారుడు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం(D) నేలకొండపల్లి(M) శంకరగిరి తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన ధరావత్ రాజు(24) ఏ పని చేయకుండా కాళీగా ఉంటున్నాడని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని తెలిపారు. ఒక్కగానొక్క కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీటిపర్యాంతమయ్యారు. గ్రామంలో విషాదం నెలకొంది.
News April 20, 2025
నిప్పుల కొలిమిని తలపిస్తున్న ఖమ్మం

ఖమ్మం జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తుంది. ఉదయం 9 గంటల నుంచి భానుడు ఉగ్రరూపం దాల్చుతుండడంతో ప్రజలు సాయంత్రం వరకు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. అలాగే జిల్లాలోని పలుచోట్ల 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే వారం రోజులు సాధారణం కంటే రెండు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.