News February 14, 2025

కరీంనగర్: ఆ ఘటనకు 11 ఏళ్లు..

image

పొన్నం ప్రభాకర్‌పై పార్లమెంట్‌లో పెప్పర్ స్ప్రే దాడి జరిగి 11 ఏళ్లు పూర్తయింది. 2014 feb 13న లోక్‌సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన పెప్పర్ స్ప్రే దాడికి పొన్నం ప్రభాకర్ తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. TG రాష్ట్ర సాధన కోసం KNR MP హోదాలో ఆయన పోరాటం చేశారు. ప్రస్తుతం ఆయన HSBD ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ఉన్నారు.

Similar News

News March 14, 2025

జగిత్యాల: హోలీ వేడుకల్లో కలెక్టర్ దంపతులు

image

మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల సదనం చిన్నారులతో జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ దంపతులు అదనపు కలెక్టర్ బి.ఎస్‌లత తో కలిసి శుక్రవారం హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు కలెక్టర్ దంపతులకు రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ పిల్లలకి మిఠాయిలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి డా. నరేశ్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి హరీశ్ పాల్గొన్నారు.

News March 14, 2025

వరంగల్: హోలీ వేడుకల్లో కలెక్టర్ శారద

image

టీఎన్జీవో నాయకుల ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని హోలీ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ వేడుకలలో కలెక్టర్ కుటుంబంతో కలిసి పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో హోలీ పండుగ జరుపుకోవాలని సూచించారు.

News March 14, 2025

అయ్యో లక్ష్యసేన్: సెమీస్‌కు చేరకుండానే ఇంటికి..

image

భారత యంగ్ షట్లర్ లక్ష్యసేన్ దూకుడుకు తెరపడింది. ఆల్‌ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి ఆయన నిష్క్రమించారు. బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన క్వార్టర్ ఫైనల్లో తన కన్నా మెరుగైన ర్యాంకర్, చైనా ఆటగాడు లీ షి ఫెంగ్ చేతిలో ఓటమి చవిచూశారు. వరుసగా రెండు గేముల్లో 10-21, 16-21 తేడాతో పరాజయం పాలయ్యారు. ఆటలో అతడు ఏ దశలోనూ లయ అందుకోలేదు. 2022లో లక్ష్య ఇక్కడ ఫైనల్‌కు చేరడం గమనార్హం.

error: Content is protected !!