News February 15, 2025
కరీంనగర్: ఎక్కడ చూసినా అదే చర్చ

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా MLC హీట్ వేడెక్కింది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, BJP అభ్యర్థులు నరేందర్ రెడ్డి, అంజిరెడ్డిలతో పాటు మాజీ ప్రొఫెసర్, BSPఅభ్యర్థి ప్రసన్న హరికృష్ణ, AIFB అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్, శేఖర్ రావు, ముస్తక్ అలీ, తదితరనేతల మధ్యపోటీ నెలకొందని చర్చలు జరుగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు మార్నింగ్ వాక్, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.
Similar News
News March 14, 2025
వికారాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌లో కనీస వసతులు కల్పించాలి: సీపీఎం

వికారాబాద్ జిల్లాలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్‌లో కనీస వసతులు కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్.మహిపాల్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా TGSRTC బస్టాండ్‌లల్లో ప్రయాణికులకు బాత్రూంలు, మంచినీళ్లు కనీస సౌకర్యాలు కల్పించడంలో ఆర్టీసీ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కనీస సౌకర్యాలు కల్పించడంతో పాటు బస్సుల సంఖ్య పెంచాలని మహిపాల్ కోరారు.
News March 14, 2025
BPO ఉద్యోగులకు Shocking News!

AI రాకతో BPO/BPM ఇండస్ట్రీలో హైరింగ్ తగ్గుతుందని నిపుణుల అంచనా. కంపెనీ ఆపరేషన్స్‌లో రీస్ట్రక్చర్ తప్పనిసరని, ఉద్యోగుల విధులు మారుతాయని అంటున్నారు. డేటా ఎంట్రీ, కస్టమర్ సపోర్టు, లావాదేవీల ప్రక్రియ వంటి సాధారణ పనులకు ఇకపై మనుషుల అవసరం ఉండదని చెప్తున్నారు. AI టాస్కుల పర్యవేక్షణ, దాంతో పనిచేయించే, కలిసి పనిచేసే ఉద్యోగాల సృష్టి జరుగుతుందని, ఇందుకు వారు ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు.
News March 14, 2025
పాలకొల్లులో డయాలసిస్ సెంటర్ ప్రారంభం

రాష్ట్రంలో రెండు డయాలసిస్ కేంద్రాలు మాత్రమే మంజూరు కాగా, అందులో ఒకటి, పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం పాలకొల్లులోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్‌ను రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి అనగాని సత్య కుమార్ యాదవ్, జలవనరుల శాఖ మంత్రి ప్రారంభించారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.