News May 12, 2024
కరీంనగర్: ఎడారి దేశంలో యువకుడి మృతి
జీవనోపాధి కోసం ఎడారి దేశం వెళ్లిన యువకుడు మృతిచెందిన ఘటన భీమారం మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మోత్కురావుపేట గ్రామానికి చెందిన గణేశ్(26) గత కొన్ని నెలల క్రితం అల్-ఎయిన్ (UAE)వెళ్ళాడు. అక్కడ ప్రమాదవశాత్తు మ్యాన్ హోల్లో పడి మృతి చెందాడు. రెండురోజుల క్రితం స్నేహితులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గణేశ్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Similar News
News January 21, 2025
కాంగ్రెస్ నాయకులకు దిశా నిర్దేశం చేసిన మంత్రి పొన్నం
నేటి నుంచి నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కొరకు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్న సందర్భంగా హుస్నాబాద్ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. నియోజకవర్గ పరిధిలోని మండల కాంగ్రెస్ అధ్యక్షులు, కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు, గ్రామ కాంగ్రెస్ కమిటీ సభ్యులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, ఇందిరమ్మ కమిటి సభ్యులు పాల్గొనాలని కోరారు.
News January 21, 2025
సిరిసిల్ల: బిందెలో ఇరుక్కున్న ఓ చిన్నారి తల
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సంజీవయ్యనగర్‌లో ఓ చిన్నారి తల నీళ్ల బిందెలో ఇరుక్కుంది. ఎంత ప్రయత్నించినా బిందెలో నుంచి పాప తల బయటికి రాకపోవడంతో బిందెను జాగ్రత్తగా కత్తిరించి పాప తలను జాగ్రత్తగా బయటకు తీశారు. ఈ ఘటనలో పాపకు ఎలాంటి ప్రమాదం కాలేదు. ఇంత జరుగుతున్నా ఆ చిన్నారి ఏడవకుండా ధైర్యంతో ఉండడానికి చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
News January 21, 2025
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు
జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం రూ.90,177 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.37,948 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.44,260, అన్నదానం రూ.7,969,వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.