News February 25, 2025
కరీంనగర్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో త్రిముఖ పోరు

ఉమ్మడి KNR, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్ నుంచి ‘అల్ఫోర్స్’ అధినేత నరేందర్ రెడ్డి, బీజేపీ నుంచి చిన్నమైల్ అంజిరెడ్డి, బీఎస్పీ అభ్యర్థిగా ప్రసన్న హరికృష్ణ పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ముగ్గురి మధ్యనే పోటీ నెలకొంది. ఈరోజు సాయంత్రం 4 గంటలతో ప్రచారానికి తెర పడనుంది. ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. వీరిలో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి?
Similar News
News February 25, 2025
హోరెత్తితున్న MLC ఎన్నికల చివరి రోజు మొబైల్ ప్రచారం

ఉభయగోదావరి జిల్లాలో నిర్వహించనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం మంగళవారం చివరి రోజు కావడంతో అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఓటర్లు మొబైల్ ఫోన్ కలిగి ఉండడంతో ప్రతి 5 నిమిషాలకు ఒకసారి అభ్యర్థులు, పలువురి అధికారుల రికార్డింగ్ వాయిస్‌తో ఫోన్‌లు చేస్తున్నారని ఓట్లరు అంటున్నారు. ప్రతి 5నిమిషాలకు ఫోన్ రావడంతో ఓటర్లు విసుగుచెందుతున్నట్లు పేర్కొన్నారు.
News February 25, 2025
శివ భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలి: మంత్రి

రాష్ట్ర నలుమూలల నుంచి శ్రీశైలం వచ్చే శివ భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి ఫరూక్ ఆదేశించారు. మంగళవారం మహా శివరాత్రి ఏర్పాట్లపై మంత్రి ఫరూక్, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, కలెక్టర్ రాజకుమారి, ఇతర అధికారులతో సమీక్షించారు. బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వ అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు.
News February 25, 2025
ముఖ్రా(కె)లో చెట్లకు క్యూ ఆర్ కోడ్

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖ్రా(కె) మాజీ సర్పంచ్ గాడ్గె మీనాక్షి పర్యావరణ పరిరక్షణకు కొత్తబాట వేశారు. ‘డిజిటల్ ట్రీ ఆధార్’తో ప్రతి చెట్టును జియో-ట్యాగ్ చేయడం, క్యూఆర్ కోడ్‌లను కేటాయించారు. పర్యావరణ బాధ్యత అంటే ఇదే! ప్రతి చెట్టు ఆధార్ కార్డులతో పౌరుల వలె వృద్ధి చెందేలా ఈ విప్లవాత్మక ఆలోచనకు మద్దతు ఇద్దామని BRS మాజీ ఎంపీ సంతోశ్ కుమార్ ఎక్స్ వేదికగా పోస్టు చేసి ఆమెను అభినందించారు.