News February 8, 2025
కరీంనగర్: ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేసిన మాజీ డీఎస్పీ

కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా మాజీ డీఎస్పీ మధనం గంగాధర్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. కరీంనగర్ కోర్టు చౌరస్తా వద్ద అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. గీతా భవన్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీగా తరలి వెళ్లారు. అనంతరం కలెక్టర్ పమేల సత్పత్తికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. అంబేడ్కర్ ఆశయసాధనే తన లక్ష్యమని గంగాధర్ తెలిపారు.
Similar News
News December 15, 2025
MLG: రెండో విడతలో తగ్గిన పోలింగ్ శాతం

మొదటి విడతలో కంటే రెండో విడతలో స్వల్పంగా పోలింగ్ శాతం తగ్గింది. మొదటి విడతలో NLG, CDR రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 14 మండలాల్లో జరిగిన ఎన్నికల్లో 90.53 శాతం పోలింగ్ నమోదు కాగా రెండో విడతలో MLG డివిజన్ లోని 10 మండలాల్లో జరిగిన ఎన్నికల్లో 88.74 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. రెండో విడత పోలింగ్‌లో అత్యధికంగా మాడుగులపల్లి మండలంలో 92.34 శాతం పోలింగ్ నమోదు కాగా, మిర్యాలగూడలో 85.79 శాతం పోలింగ్ నమోదైంది.
News December 15, 2025
అన్నమయ్య జిల్లాలో మరికొందరు సీఐల బదిలీ

అన్నమయ్య జిల్లాలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. డి.రామాంజనేయుడును అన్నమయ్య SC, ST సెల్ నుంచి ప్రొద్దుటూరు త్రీటౌన్‌కు బదిలీ చేశారు. టి.మధును అనంతపురం రేంజ్ సర్కిల్ నుంచి DPTC అన్నమయ్యకు, అక్కడ ఉన్న . ఆదినారాయణ రెడ్డిని DCRB, అన్నమయ్యకు బదిలీ చేశారు. ఎం.తులసి రామ్‌ను DCRB నుంచి వీఆర్‌కు పంపారు.
News December 15, 2025
WGL: రెండో విడత జీపీ ఎన్నికల్లో పార్టీల వారీగా గెలుపులు!

ఉమ్మడి జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిపత్యం సాగింది. మొత్తం 563 జీపీల్లో 332 స్థానాల్లో కాంగ్రెస్, 181లో BRS, 9 బీజేపీ, 41 చోట్ల స్వతంత్రులు విజయం సాధించారు. జిల్లాల వారీగా HNK కాంగ్రెస్ 39, బీఆర్ఎస్ 22, WGL కాంగ్రెస్ 70, బీఆర్ఎస్ 40, JNG కాంగ్రెస్ 26, బీఆర్ఎస్ 38, BHPL కాంగ్రెస్ 46, బీఆర్ఎస్ 30, MLG కాంగ్రెస్ 36, BRS 13, MHBD కాంగ్రెస్ 115, BRS 38 స్థానాలు గెలిచాయి.


