News April 10, 2025
కరీంనగర్: కూతురిని చంపి తల్లి సూసైడ్

పెద్దపలి టీచర్స్ కాలనీలో <<16048255>>కూతురిని <<>>చంపి తల్లి సూసైడ్ చేసుకుంది. పోలీసుల వివరాలు.. జూలపల్లి వాసి వేణుగోపాల్ రెడ్డితో KNR జిల్లా రామడుగు(M) వెదిరకు చెందిన సాహితి(26)కి పెళ్లైంది. రాత్రి వేణుగోపాల్ ఇంటికి వచ్చేసరికి కూతురు రితిన్యను చంపి భార్య ఉరేసుకుని కనిపించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 15, 2025
మిరపలో పూత, కాయతొలుచు పురుగు నివారణ

ఈ సమయంలో మిరపలో పూత పురుగు, కాయ తొలుచు పురుగు ఉద్ధృతి కూడా ఉంటుంది.
☛ మిరపలో పూత పురుగు నివారణకు లీటరు నీటికి కార్బోసల్ఫాన్ 1.6ml మందును 1500 పి.పి.ఎం వేపనూనె 5mlతో కలిపి పిచికారీ చేయాలి.
☛ మిరపలో కాయతొలుచు పురుగు నివారణకు లీటరు నీటికి ఫ్లూబెండమైడ్ + థయాక్లోప్రిడ్ 0.5 మి.లీ. లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్+ ఫిప్రోనిల్ 1.2 మి.లీ. మందును కలిపి పిచికారీ చేయాలి.
News December 15, 2025
ఇతిహాసాలు క్విజ్ – 97 సమాధానం

ఈరోజు ప్రశ్న: ఈ ఆలయంలో కొలువైన అంజన్న స్వామికి రెండు ముఖాలు ఉంటాయి. అందులో ఒకటి హనుమంతుడిది కాగా, మరొకటి నరసింహస్వామిది. మూల విరాట్టు భుజాలపై శంఖుచక్రాలు, ఛాతి మీద సీతారాముని రూపాలు కూడా కనిపిస్తాయి. ఈ ఆలయం తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది.
సమాధానం: కొండగట్టు అంజన్న స్వామి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News December 15, 2025
రాష్ట్రంలోనే బాపట్ల జిల్లాకు ఏడో స్థానం

ఇ-ఆఫీస్ విధానాన్ని అధికారులు అలవర్చుకోవాలని కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు. ఈ-ఆఫీస్ విధానంలో రోజుకు 9 గంటల్లో జిల్లాలో 1,363 ఫైల్స్ పరిశీలన, పరిష్కారంపై రాష్ట్రంలోనే 7వ స్థానంలో నిలిచానన్నారు. దీంతో జిల్లా అధికారులు కలెక్టర్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఖజానా శాఖలో ఈ-ఫైల్స్ ఒక్కటి కూడా నమోదు కాకపోవడంపై ఆరా తీశారు. నిర్లిప్తంగా ఉండరాదని, కచ్చితంగా ఈ-ఫైలింగ్ చేపట్టాలని ఆదేశించారు.


