News August 18, 2024
కరీంనగర్: కొడుకు బారసాల చూడకుండానే తండ్రి సూసైడ్

కుమారుడి బారసాల చూడకుండానే తండ్రి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. శంకరపట్నం మండలం ముత్తారానికి చెందిన నాగిని వినోద్‌కుమార్ (34)కు నాలుగేళ్ల క్రితం పచ్చునూర్‌కు చెందిన లిఖితతో వివాహం జరిగింది. వీరికి ఇటీవల కుమారుడు జన్మించాడు. మరో 4 రోజుల్లో బారసాల ఉండగా.. తన మామయ్య సమ్మయ్య పొలం వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.
Similar News
News March 11, 2025
కరీంనగర్: మనం ప్రమాదకరమైన గాలిపీలుస్తున్నాం..!

కర్బన ఉద్గారాలతో గాలి నాణ్యత తగ్గి, భిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడి ప్రజలు ఉక్కరిబిక్కిరి అవుతున్నారు. గాలి నాణ్యత విలువ 0-50 ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. 51-100ఉంటే పర్వాలేదని, 101-150 ఉంటే పెద్దలూ, పిల్లల్లో ఊపిరితిత్తులు, ఇతర వ్యాధులు రావొచ్చని హెచ్చరిస్తున్నారు. 201-300 ఉంటే అందరికి వచ్చే ప్రమాదముంది. కరీంనగర్‌లో గాలినాణ్యత విలువ 104గా ఉంది. ఇప్పటికైనా మనం మారాల్సిన అవసరముంది. ఏమంటారు!
News March 10, 2025
కరీంనగర్: జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన సీపీ

కరీంనగర్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన గౌస్ ఆలం కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని మర్యాదపూర్వకంగా కలిశారు. కరీంనగర్ కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి పూల మొక్కను అందజేశారు. అనంతరం కరీంనగర్ జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు అధికారులు చర్చించారు.
News March 10, 2025
కరీంనగర్: 322 మంది విద్యార్థుల గైర్హాజరు

కరీంనగర్ జిల్లాలో నిర్వహిస్తున్న ఇంటర్ ఎగ్జామ్‌లో భాగంగా సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్ 2 ప్రశాంతంగా ముగిసినట్లు సోమవారం జిల్లా విద్యాధికారులు తెలిపారు. ఇంటర్ పరీక్షలకు 15,381 మంది విద్యార్థులకు గాను 15,059 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్షలకు 322 మంది విద్యార్థులు హాజరు కాలేదని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.