News February 24, 2025
కరీంనగర్: గం‘జాయ్’లో యువత

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గంజాయి గుప్పుమంటోంది. ఇటీవల రామగుండంలో 60 లక్షల విలువైన 120 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అదేవిధంగా సిరిసిల్ల జిల్లాలో ఇప్పటివరకు 22 గంజాయి కేసులు నమోదు చేసి 48మందిని అరెస్టు చేశారు. జగిత్యాల రూరల్ మండలం కండ్లపల్లిలో గంజాయి విక్రయిస్తున్న 5గురిని అరెస్టు చేశారు. ధర్మపురి మండలం మగ్గిడికి చెందిన ముగ్గురు వ్యక్తులు గంజాయి సరఫరా చేయడంతో అరెస్టు చేశారు.
Similar News
News February 24, 2025
అనంతపురం జిల్లాలో హత్య.. ఐదుగురికి జీవిత ఖైదు

అనంతపురం జిల్లా నార్పలకు చెందిన మట్టి పవన్ కుమార్ హత్య కేసులో ఐదుగురికి జీవితకాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ సోమవారం సంచలన తీర్పు చెప్పారు. 2022లో స్నేహితుల మధ్య విభేదాలతో దాడి జరగ్గా పవన్ మృతి చెందారు. ఈ ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు దఫాల విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో జీవిత కారాగార శిక్ష, రూ.20 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.
News February 24, 2025
అసెంబ్లీలో YCPని ప్రతిపక్షంగా గుర్తించాలి: పెద్దిరెడ్డి

అసెంబ్లీలో వైసీపీని ప్రభుత్వం ప్రతిపక్షంగా గుర్తించాలని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం విధ్వంసం సృష్టించినట్లు ఆరోపణలు చేస్తున్న కూటమి ప్రభుత్వం వాటిని ఎక్కడా నిరూపించలేదన్నారు. అసెంబ్లీలో మాజీ సీఎం జగన్‌కు మాట్లాడే అవకాశం కల్పించాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు.
News February 24, 2025
‘దసరా’తో గేర్ ఛేంజ్.. ‘హిట్3’తో బ్లడ్ బాత్

ఫీల్ గుడ్ మూవీస్‌తో ఆకట్టుకున్న న్యాచురల్ స్టార్ నాని గేర్ మార్చారు. దసరాతో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేయగా ‘సరిపోదా శనివారం’తో యాక్షన్‌కు పెద్ద పీట వేశారు. తాజాగా రిలీజైన ‘హిట్3’ <<15561948>>టీజర్‌లో<<>> నాని ఊచ కోత మామూలుగా లేదని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. యాంగ్రీ పోలీస్ రోల్‌లో రక్తపాతం సృష్టించారని చెబుతున్నారు. దీంతో తర్వాత రాబోయే ‘ది ప్యారడైజ్’ ఎలా ఉంటుందో అని చర్చించుకుంటున్నారు.