News February 1, 2025
కరీంనగర్: చంటి బాబుతో వచ్చి సత్తా చాటిన మహిళా కానిస్టేబుల్
కరీంనగర్‌లో జరుగుతున్న మూడో రాష్ట్ర పోలీస్ క్రీడా పోటీల్లో శనివారం ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వరంగల్ పోలీస్ బృందానికి చెందిన మహిళా కానిస్టేబుల్ రజియా బేగం తన ఏడాదిన్నర కొడుకును ఇంట్లో వదిలిపెట్టి ఉండలేక తనతో పాటు క్రీడా మైదానానికి తీసుకొచ్చింది. ఈరోజు ఉదయం తన బాబు సమక్షంలో జరిగిన డిస్కస్ త్రో ఫైనల్స్‌లో సత్తా చాటి సిల్వర్ మెడల్ సాధించింది. దీంతో అధికారులు, తోటి క్రీడాకారులు ఆమెను అభినందించారు.
Similar News
News February 1, 2025
తిరుపతి: 95.68 శాతం పంపిణీ పూర్తి
తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ శనివారం 95.68 శాతం పూర్తి అయినట్లు అధికారులు వెల్లడించారు. 97.12 శాతంతో తిరుపతి మున్సిపాలిటీ తొలి స్థానంలో ఉండగా.. 93.2 శాతంతో వాకాడు చివరి స్థానంలో నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే తిరుపతి జిల్లా 95.68 శాతంతో రాష్ట్రంలో మూడో స్థానంలో ఉంది.
News February 1, 2025
పెద్దపల్లి: విద్యా కమిషన్ ప్రజా అభిప్రాయ సేకరణ: కలెక్టర్
పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో ఫిబ్రవరి 4న తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ రాష్ట్ర నూతన విద్య పాలసీ రూపకల్పన పై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర రాష్ట్ర విద్యా పాలసీ రూపకల్పన కోసం విద్యా కమిషన్‌కు బాధ్యతలు అప్పగించిందని, అభిప్రాయాలను విద్యా కమిషన్‌కు తెలియజేయాలని పేర్కొన్నారు.
News February 1, 2025
సిద్దిపేట: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్.. తుపాకులు అప్పగించండి: CP
గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినందున లైసెన్స్ తుపాకులు పొందిన వారు స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించాలని పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ సూచించారు. లైసెన్స్ ఉన్న తుపాకులను స్థానిక పోలీస్ స్టేషన్లో ఈ నెల 8లోగా డిపాజిట్ చేయాలని ఆదేశించారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం యథావిధిగా తీసుకువెళ్లవచ్చని చెప్పారు.