News March 5, 2025
కరీంనగర్: చెల్లని ఓట్లు 28,686

కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎన్నికలలో మొత్తం 2,52,029 మంది ఓటు వేయగా అందులో 2,23,343 ఓట్లు చెల్లుబాటు కాగా 28,686 ఓట్లు చెల్లుబాటు కానట్లు అధికారులు బుధవారం ప్రకటించారు. 1,11,672 ఓట్లను కోటా నిర్ధారణ ఓట్లుగా నిర్ణయించారు. కాగా తొలి ప్రాధాన్యత ఓట్లలో బీజేపీ అభ్యర్థికి ఆధిక్యత లభించింది.
Similar News
News December 22, 2025
మహబూబ్‌నగర్: నేడు జిల్లాకు ఐదుగురు మంత్రుల రాక

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, అజారుద్దీన్, జి.వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి రానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అప్పనపల్లిలో గొర్రెలు, మేకలకు నత్తల నివారణ మందుల పంపిణీని ప్రారంభించనున్నారు. అనంతరం పిల్లలమర్రి సమీపంలో ఉన్న ఎండీసీఏ గ్రౌండ్‌లో ‘కాకా స్మారక క్రికెట్ టోర్నీ’ని మంత్రులు ప్రారంభించనున్నారు.
News December 22, 2025
బాపట్ల: కోడి గుడ్డు ధరకు రెక్కలు..!

తక్కువ ధరకు లభించే పౌష్టికాహారమైన కోడిగుడ్ల ధర ఆకాశాన్నంటింది. మేదరమెట్లలో కోడిగుడ్ల ధరలు పౌల్ట్రీ చరిత్రలోనే ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరాయి. ఆదివారం హోల్‌సేల్ మార్కెట్‌లోనే ఒక్కో గుడ్డు ధర రూ.7.30 ఉండగా, బహిరంగ మార్కెట్‌లో రూ.8కి విక్రయిస్తున్నారు. నాటు కోడి గుడ్డు ఏకంగా రూ.15 పలుకుతోంది. దాణా, నిర్వహణ ఖర్చులు పెరగడంతో రైతులు ఫారాలను మూసివేస్తుండటంతో డిమాండ్ పెరిగిందని వ్యాపారులు అంటున్నారు.
News December 22, 2025
‘SHANTI’ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

సస్టైనబుల్ హార్నెస్సింగ్ & అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా(SHANTI) బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో దేశంలో సివిల్ న్యూక్లియర్ సెక్టార్‌లో ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యానికి మార్గం సుగమమైంది. ఇప్పటివరకు అమల్లో ఉన్న అటామిక్ ఎనర్జీ యాక్ట్-1962, సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్-2010ను కేంద్రం రద్దు చేసింది.


