News February 27, 2025
కరీంనగర్: నేడే పోలింగ్.. అంతా రెడీ!

నేడు జరగనున్న KNR, MDK, ADB, NZB పట్టభద్రుల, టీచర్ MLC ఎన్నికల పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు. పట్టభద్రులు 71,545, ఉఫాధ్యాయులు 4,035 మంది ఓటర్లు ఉన్నారు. పట్టభద్రుల కోసం 85, ఉపాధ్యాయుల కోసం 18 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్టభద్రుల బరిలో 56 మంది, ఉపాధ్యాయ స్థానంలో 15 మంది ఉండగా.. ఎవరు విజేతగా నిలుస్తారో మార్చి 3వ తేదీ వరకు వేచి ఉండాల్సిందే.
Similar News
News February 27, 2025
కరీంనగర్: గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నమోదైన వివరాలు

ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల, టీచర్ల స్థానాలకు గురువారం కరీంనగర్ జిల్లాలోని ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ఉదయం 08.00 గంటల నుంచి 12.00 గంటల వరకు 18.88 శాతం నమోదు అయింది. అలాగే టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్ శాతం ఉదయం 08.00 గంటల నుంచి 12.00 గంటల వరకు 34.98 శాతం నమోదు అయింది.
News February 27, 2025
కరీంనగర్: పోలింగ్ స్టేషన్లను సందర్శించిన కలెక్టర్

కరీంనగర్ లోని ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ స్టేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. డాక్టర్ స్ట్రీట్ లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో గల గ్రాడ్యుయేట్ పోలింగ్ స్టేషన్‌ను, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ స్టేషన్‌ను సందర్శించారు. పోలింగ్ సరళిపై ప్రిసైడింగ్ అధికారిని అడిగి తెలుసుకున్నారు.
News February 27, 2025
KNR: ఓటు వేసిన బీఎస్పీ అభ్యర్థి

కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగుతుంది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఆయన సతీమణి ప్రసన్న ఓటు హక్కు వినియోగించుకున్నారు. బోయినపల్లి పోలింగ్ కేంద్రంలో వారిరువురు ఓటు వేశారు. ఓటర్లు అందరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.