News March 23, 2025
కరీంనగర్: పదో తరగతి పరీక్షలు.. 14 మంది గైర్హాజరు

శనివారం నిర్వహించిన పదో తరగతి హిందీ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 14 మంది గైర్హాజరయ్యారు. 12,491 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. అదేవిధంగా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కరీంనగర్ నగరంలోని పలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Similar News
News March 29, 2025
కరీంనగర్: ఉగాది నుంచి సన్నబియ్యం

ఉగాది నుంచి ప్రజలకు సన్నబియ్యం పంపిణి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రేషన్‌కార్డుల్లో పేర్లు నమోదై ఉన్న ప్రతి ఒక్కరికీ 6కిలోల చొప్పున బియ్యం సరఫరా చేయనున్నారు.కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,76,908 కుటుంబాలకు రేషన్ కార్డుల ద్వారా బియ్యం, నిత్యావసర వస్తువులను సరఫరా చేయనున్నారు. దీంతో 8,04,968 మంది సన్నబియ్యాన్ని పొందుతారు.
News March 28, 2025
కరీంనగర్: UDID కార్డుల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

దివ్యాంగులకు జారీ చేయనున్న UDIDకార్డుల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి వైద్య, ఆరోగ్య అధికారులను ఆదేశించారు. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని UDIDకార్డుల వైద్య పరీక్షల విభాగాన్ని కలెక్టర్ శుక్రవారం సందర్శించారు. UDIDకార్డుల జారీలో భాగంగా వైద్య పరీక్షలకు వచ్చే దివ్యాంగులకు వసతులు కల్పించాలన్నారు. ర్యాంపు, టాయిలెట్స్ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు.
News March 28, 2025
కరీంనగర్: ధాన్యం కొనుగోలు పట్ల అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

జిల్లాలో ఐకెపి ఆధ్వర్యంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను 150కి పెంచుతున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సమీక్ష సమావేశం నగరంలోని స్వశక్తి భవన్లో శుక్రవారం నిర్వహించారు. కొనుగోళ్ల పట్ల ఏపీఎంలు, సెంటర్ ఇన్చార్జులు అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. ధాన్యం కొనుగోలు నమోదు ప్రక్రియ పకడ్బందీగా ఉండాలని పేర్కొన్నారు.