News February 26, 2025
కరీంనగర్: ప్రయాగరాజ్ వెళ్లి వస్తూ చనిపోయాడు..!

కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. వీణవంక మండల కేంద్రానికి చెందిన గౌడ సంఘం సభ్యుడు నల్లగోని వీరయ్య ఇటీవల యూపీలోని ప్రయాగరాజ్‌కు వెళ్లి కుంభమేళాలో పాల్గొని శివయ్యను దర్శించుకున్నాడు. తిరిగి వాహనంలో వస్తున్న క్రమంలో మంగళవారం అర్ధరాత్రి నిజామాబాద్ పట్టణంలోకి రాగానే అతడికి హఠాత్తుగా గుండెపోటు వచ్చి చనిపోయాడు.
Similar News
News February 26, 2025
విశాఖలో రేపు పాఠశాలలకు సెలవు

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో విశాఖలో అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సూచనల మేరకు సెలవు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అన్ని పాఠశాలల యాజమాన్యాలు విధిగా నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ మేరకు బుధవారం ఆదేశాలు జారీ చేశారు.
News February 26, 2025
తన రాతను తానే మార్చుకుని.. ఛాంపియన్‌గా!

పుట్టుకతోనే HIV సోకడంతో సమాజమంతా ఆమెను వెలివేసింది. బంధువులెవరూ దగ్గరకు రానివ్వని వేళ తన చేతిరాతను మార్చుకునేందుకు రన్నింగ్ ట్రాక్‌లోకి అడుగుపెట్టింది. ఆమె ఎవరో కాదు అథ్లెట్ సోనికా సంజు కుమార్. మాజీ అథ్లెట్ ఎల్విస్ జోసెఫ్ & బెంగుళూరు స్కూల్స్ స్పోర్ట్స్ ఫౌండేషన్ (BSSF) చొరవతో రన్నింగ్‌లో నైపుణ్యం పెంచుకుంది. అప్పటి నుంచి టోర్నమెంట్స్‌లో పాల్గొంటూ మెడల్స్ సాధించి ఔరా అనిపిస్తోంది.
News February 26, 2025
ఎమ్మెల్సీ ఓటు వేసేందుకు ప్రత్యేక సెలవు: జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నమోదీత ఓటర్లుగా ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు ఓటు వినియోగించుకునేందుకు ప్రత్యేక సెలవు వర్తిస్తుందని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. వ్యాపార వాణిజ్య పారిశ్రామిక సంస్థ, ఇతర అన్ని ప్రైవేటు మేనేజ్మెంట్లు లలో పనిచేస్తు ఓటు హక్కు ఉన్న ఉద్యోగు ఓటు వేసేందుకు యాజమాన్యాలు అనుమతి ఇవ్వాలని తెలిపారు.