News May 30, 2024

కరీంనగర్: బడి బస్సు భద్రమేనా?

image

వచ్చే నెల జూన్ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. నెల రోజులుగా షెడ్డులో ఉన్న ప్రైవేట్ పాఠశాలల బస్సులు రోడ్డెక్కేందుకు సిద్ధమవుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2,389 ప్రైవేటు పాఠశాలలు బస్సులు ఉన్నాయి. వీటి ఫిట్‌నెస్ గడువు ఈ నెల 15తో ముగిసింది. ఈ వార్షిక సంవత్సరం బస్సులు రోడ్డెక్కాలంటే ఆర్టీఏ కార్యాలయంలో ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంది. 

Similar News

News September 29, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ జగిత్యాలలో జానపద గాయకుడు మల్లిక్ తేజ పై కేసు. @ రాయికల్ మండలంలో జ్వరంతో బాలిక మృతి. @ శంకరపట్నం మండలంలో కారు బోల్తా పడి ఇద్దరికీ తీవ్ర గాయాలు. @ బెజ్జంకి మండలంలో రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు. @ మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వెంకయ్యకు డాక్టరేట్. @ రాయికల్ ఎస్సైగా సుధీర్ రావు బాధ్యతల స్వీకరణ. @ కరీంనగర్ లో ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సుల ప్రారంభం.

News September 29, 2024

జగిత్యాల: దసరా కానుకగా వెరైటీ లక్కీ డ్రా

image

జగిత్యాల జిల్లా భీమారం మండలంలో దసరా సందర్భంగా పలువురు యువకులు వెరైటీ లక్కీ డ్రా ఏర్పాటు చేశారు. లక్కీ డ్రాలో 12 రకాల ఆఫర్లు పెట్టారు. రూ.100తో లక్కీ డ్రా తీస్తే మొదటి బహుమతిగా 2 కిలోల మటన్, రెండో బహుమతిగా మేక తల, మూడో బహుమతి నాటుకోడి పుంజు, ఇలా.. కోడిగుడ్లు, బీరు, విస్కీ, బట్టలు అంటూ 12 రకాల ఆఫర్స్ ఏర్పాటు చేశారు. అక్టోబర్ 11న లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

News September 29, 2024

మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న KNR మాజీ MP

image

కరీంనగర్ మాజీ ఎంపీ, ప్లానింగ్ బోర్డ్ మాజీ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ములుగు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మేడారంలోని శ్రీ సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు బీఆర్ఎస్ శ్రేణులు స్వాగతం పలికారు. అనంతరం మేడారంలో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవార్ల దీవెనలతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.