News April 6, 2025

కరీంనగర్: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నిషేధం

image

KNR కమిషనరేట్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, DJ సౌండ్‌ల వినియోగంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను ఈనెల30 వరకు పొడగించామని CP గౌస్ ఆలం ఒక ప్రకటనలో తెలిపారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, కార్యక్రమాల నిర్వహణకు మైక్‌సెట్ వినియోగం తప్పనిసరైతే స్థానిక ACP అనుమతి పొందాలన్నారు.

Similar News

News April 9, 2025

KNR పోలీసులు GREAT.. తండ్రి, పిల్లలను కాపాడారు!

image

కుటుంబ కలహాలతో ఇద్దరు చిన్నారులతో కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్తున్న తండ్రిని కాపాడినట్లు కరీంనగర్ 2వ టౌన్ పోలీసులు తెలిపారు. విద్యానగర్‌కు చెందిన దశరథ్ అనే వ్యక్తి కుటుంబ కలహాలతో తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు 2 టౌన్ పోలీసులను ఆశ్రయించడంతో మొబైల్ ఫోన్ ఆధారంగా ట్రై చేసి దశరథ్ అతని ఇద్దరి పిల్లలను క్షేమంగా అప్పజెప్పారు.

News April 9, 2025

వేములవాడ: క్రికెట్ బాల్ తగిలి బాలుడు మృతి

image

క్రికెట్ బాల్ తగిలి బాలుడు మృతి చెందిన ఘటన ఓ కుటుంబంలో విషాదం నింపింది. వేములవాడలోని కోరుట్ల బస్‌స్టాప్ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి, మానస దంపతుల కుమారుడు అశ్విత్ రెడ్డి(11) ఈ నెల 3న ఇంటి పక్కన పిల్లలతో కలిసి క్రికెట్ ఆడాడు. ఈ క్రమంలో బాల్ అతడి తలకు తాకడంతో గాయమైంది. చికిత్స కోసం అతడిని కరీంనగర్ అక్కడి నుంచి హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.

News April 9, 2025

ఇస్రో యువిక -2025కు జగిత్యాల విద్యార్థిని

image

ఇస్రో నిర్వహిస్తున్న యువిక -2025 యంగ్ సైంటిస్ట్ కార్యక్రమానికి జగిత్యాల జిల్లా కొడిమ్యాల ఆదర్శ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని కొలకాని అశ్విని ఎంపికైంది. దేశవ్యాప్తంగా ఇస్రోకు చెందిన 8 పరిశోధన కేంద్రాలలో మేలో 12 రోజులు అంతరిక్ష విజ్ఞానానికి సంబంధించిన శిక్షణ ఇవ్వనున్నారు. తెలంగాణ నుంచి ఎంపికైన 12 మందిలో అశ్విని ఒకరు కావడం విశేషం. దీంతో అశ్వినికి టీచర్లు, గ్రామస్థులు అభినందనలు తెలిపారు.

error: Content is protected !!