News February 9, 2025
కరీంనగర్: రేపటితో ముగియనున్న నామినేషన్లు
KNR, ADLBD, NZBD, MDK పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికకు రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది. ఇప్పటిదాకా BJP, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు 49 మంది నామినేషన్ వేశారు. ఉపాధ్యాయ స్థానానికి బీజేపీ అభ్యర్థితో పాటు PRTUTS, TPTF అభ్యర్థులు, సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, మరో 5గురు నామినేషన్లు వేశారు. పట్టభద్రుల స్థానంలో ప్రస్తుతం కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Similar News
News February 10, 2025
20 లక్షల ఇళ్లకు సౌర విద్యుత్: చంద్రబాబు
AP: PM సూర్యఘర్ పథకం కింద ఈ ఏడాది 20 లక్షల కుటుంబాలకు సోలార్ విద్యుత్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు CM చంద్రబాబు వెల్లడించారు. 2కిలోవాట్ల వరకు SC, STలకు ఉచితంగా సోలార్ పరికరాలు అందిస్తామని చెప్పారు. ఈ పథకం అమల్లో బ్యాంకులూ భాగస్వామ్యం కావాలని బ్యాంకర్లతో భేటీలో CM కోరారు. ఈ పథకంతో అవసరాలకు ఉచితంగా విద్యుత్ పొందడమే కాకుండా, ఉత్పత్తి అయ్యే విద్యుత్‌తో ప్రజలు ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు.
News February 10, 2025
MBNR: చేపల విక్రయ వాహనాలను ప్రారంభించిన కలెక్టర్
ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజలకు సంబంధించిన రుణాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి సూచించారు. సోమవారం స్త్రీ నిధి బ్యాంక్ రుణం ద్వారా అందించిన సంచార చేపల విక్రయ వాహనాలను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. వాహనాన్ని ఎక్కడ వినియోగిస్తారు, వ్యాపారం ఎలా చేస్తారు అని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
News February 10, 2025
ADB: పత్తి కొనుగోళ్లు తాత్కాలికంగా బంద్
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు తాత్కాలికంగా నిలిపి వేసినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు సోమవారం తెలిపారు. రైతుల ఆధార్ వెరిఫికేషన్‌లో పలు సాంకేతిక సమస్యల రీత్యా కొనుగోళ్లు నిలిపివేసినట్లు వెల్లడించారు. తర్వాత కొనుగోళ్లు తేదీని వెంటనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ విషయమై రైతులు సహకరించాలని కోరారు.