News March 10, 2025

కరీంనగర్: వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి: RTC JAC

image

కరీంనగర్‌లోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో ఆర్టీసీ జేఏసీ రీజియన్ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. కార్మికులంతా సమ్మెకు సమాయత్తం కావాలని, సమ్మెకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. వెంటనే ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన ఆర్టీసీ అంశాలను అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఈ.వెంకన్న తదితరులున్నారు.

Similar News

News March 11, 2025

ములుగు: మహిళలకు వడ్డీలు చెల్లించే ప్రక్రియ కొనసాగుతుంది: సీతక్క

image

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మహిళా సంఘాలకు పూర్తిస్థాయిలో వడ్డీలు చెల్లించడం జరిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహిళా సంఘాలకు భారం కాకుండా సభ్యురాలి కుటుంబం ఇబ్బందులు పడకుండా రూ.10 లక్షల ప్రమాద భీమా చెల్లిస్తున్నామన్నారు. 400 మంది మహిళలకు రూ.40 కోట్లకు పైగా చెల్లిస్తున్నామని మంత్రి తెలిపారు.

News March 11, 2025

సంగారెడ్డి: ఇద్దరిని సస్పెండ్ చేసిన కలెక్టర్

image

ఆస్తి పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం వహించిన 17 మంది మున్సిపల్ సిబ్బందికి నోటీసులు, ఇద్దరిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ వల్లూరు క్రాంతి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వారిలో జహీరాబాద్ ఆర్ఐ సంజీవ్, సదాశివపేట మేనేజర్ ఉపేందర్ సింగ్, సంగారెడ్డి కమిషనర్ ప్రసాద్ చౌహన్ ఉన్నారు. జహీరాబాద్ సదాశివపేట బిల్ కలెక్టర్లు అహ్మద్, శ్రీకాంత్‌లను సస్పెండ్ చేశారు.

News March 11, 2025

HYD: సైబర్ క్రైం.. రూ.36 లక్షలు ఇప్పించారు

image

హైదరాబాద్‌లో రిటైర్డ్ ఉద్యోగిపై డిజిటల్ అరెస్ట్ సైబర్ నేరగాళ్లు జరిపారు. ఫెడక్స్ కొరియర్ డ్రగ్స్ పేరుతో 43లక్షల రూపాయలు బ్యాంకు ద్వారా బదిలీ చేయించుకున్నారు. బాధితుడు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బాధితుడు డబ్బును ఫ్రీజ్ చేసి 36లక్షల రూపాయలను బాధితుడికి డీడీ ద్వారా సైబర్ క్రైమ్ డీసీపీ కవిత అందజేశారు.

error: Content is protected !!