News March 16, 2025

కరీంనగర్‌: వేర్వేరు ఘటనల్లో ఆరుగురి మృతి

image

KNR జిల్లాలో నిన్న వేర్వేరు ఘటనల్లో 6గురు చనిపోయారు. JMKTలో రైలుపట్టాల పక్కన ఓ యువజంట మృతదేహాలు లభ్యంకాగా, బిజిగిరిషరిఫ్‌లో రైలు ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు జారిపడి <<15774781>>రైల్వే<<>> ఉద్యోగి కోమురయ్య మృతిచెందారు. KNRలోని ఓ లాడ్జీలో మానకొండురుకు చెందిన శివకుమార్ ఆత్మహత్య చేసుకోగా, KNR కొత్తపల్లిలో జరిగిన రోడ్డుప్రమాదంలో రేకుర్తికి చెందిన భూమయ్య(48) చనిపోయారు. మరో ప్రమాదంలో రామడుగుకు చెందిన సత్తయ్య చనిపోయారు.

Similar News

News March 16, 2025

జగిత్యాల: భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య, కుమారులు

image

JGTLరూరల్(M) పొలాసలో పడాల కమలాకర్(60)ను మొదటిభార్య, కుమారులు పెట్రోల్ పోసి శనివారం నిప్పంటించారు. గాయపడిన కమలాకర్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లగా రాత్రి చికిత్స పొందుతూ చనిపోయాడు. పోలీసుల ప్రకారం.. గతంలోనే కమలాకర్ 2 పెళ్లిళ్లు చేసుకున్నాడు. 3వ పెళ్లి చేసుకుని గ్రామంలోనే ఉంటున్నాడు. మద్యంతాగి మొదటి భార్య, కుమారులను వేధించేవాడు. కోపం పెంచుకున్న వారు కమలాకర్‌పై కత్తులతో దాడిచేసి పెట్రోల్ పోసి నిప్పటించారు.

News March 16, 2025

హుజురాబాద్‌లో నేడు రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు

image

హుజురాబాద్ పట్టణంలోని హైస్కూల్ మైదానంలో ఈ నెల 16,17,18 తేదిలలో సీనియర్ తెలంగాణ రాష్ట్ర స్థాయి మెన్ హాకీకి చాంపియన్ షిప్ పోటీలను నిర్వహిస్తున్నట్లు హుజురాబాద్ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ తోట రాజేంద్ర ప్రసాద్, అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్ తెలిపారు. ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారని పేర్కొన్నారు.

News March 16, 2025

కరీంనగర్: రైలు పట్టాల పక్కన యువజంట మృతదేహాలు (UPDATE)

image

జమ్మికుంట(M) పాపయ్యపల్లి-బిజిగిరి షరిఫ్ గ్రామాల రైల్వే ట్రాక్ మధ్య శనివారం రాత్రి ఓ <<15773958>>యువజంట<<>> మృతదేహాలు లభ్యమైన విషయం తెలిసిందే. మృతిచెందిన యువకుడు ఇల్లందకుంట(M) రాచపల్లికి చెందిన మెనగు రాహుల్(18)గా గుర్తించారు. ప్రమాదంలో ఇద్దిరి తలలకు మాత్రమే గాయాలున్నాయి. ఒంటిపై ఎక్కడా గాయాలులేవు. దీంతో ఇది ఆత్మహత్య? లేక హత్య అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

error: Content is protected !!