News January 8, 2025

కరీంనగర్: సంక్రాంతికి ప్రత్యేక బస్సులు

image

సంక్రాంతి పండుగ సందర్భంగా KNR రీజియన్‌లో మంగళవారం నుంచి 1,740 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ ఆర్‌ఎం రాజు తెలిపారు. JBS నుంచి KNRకు 770, తిరుగుప్రయాణంలో KNR నుంచి JBSకు ఈనెల 16 నుంచి 22 వరకు 970 బస్సులను నడవనున్నట్లు చెప్పారు. ఏపీలోని వివిధ ప్రాంతాలకు ప్రస్తుతం నడుస్తున్న సర్వీసులకు అదనంగా ప్రత్యేక బస్సులను HYD మీదుగా నడపనుననట్లు తెలిపారు.

Similar News

News January 9, 2025

భీమదేవరపల్లి: రేపటి నుంచి వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు

image

కొత్తకొండ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. 10న స్వామి వారి కళ్యాణం, 11న త్రిశూలార్చన, 12న లక్షబిల్వర్చన, 13న భోగి పండుగ, 14న సంక్రాంతి పండుగ సందర్భంగా బండ్లు తిరుగుట,15న కనుమ ఉత్సవం,16న పుష్పయాగం, నాగవళ్లి, 17న త్రిశూల స్నానం కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ ఈఓ కిషన్ రావు తెలిపారు.

News January 9, 2025

తొక్కిసలాట ఘటన బాధాకరం: శ్రీధర్ బాబు

image

తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే గాయపడ్డ భక్తులు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్లు Xలో పేర్కొన్నారు.

News January 9, 2025

తిరుమలలో తొక్కిసలాట అత్యంత బాధాకరం: KNR MLA

image

తిరుమలలో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ X ద్వారా ప్రగాఢ సానుభూతి తెలిపారు.  ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. దైవ దర్శనానికి వచ్చిన భక్తులు తమ ప్రాణాలను కోల్పోవడం అత్యంత బాధాకర విషయం అన్నారు.