News September 27, 2024

కరీంనగర్: సంక్షేమ అధికారులు హాస్టల్లో నిద్ర చేయాలి: కలెక్టర్

image

జిల్లాలోని అన్ని విద్యార్థి వసతి గృహాలను హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. SC, ST, BC, మైనారిటీ, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ అధికారులు, మండల విద్యాధికారులతో కలెక్టరేట్‌లో ఆమె సమావేశమయ్యారు. హాస్టల్‌లో రాత్రి నిద్ర చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. మండల విద్యాధికారులు, మండల ప్రత్యేక అధికారులు హాస్టళ్ళను సందర్శించాలన్నారు.

Similar News

News November 17, 2024

వేములవాడ రాజన్నను దర్శించుకున్న 50,796 మంది భక్తులు

image

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి కార్తీక మాసం ఆదివారం పురస్కరించుకొని 50,796 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. ధర్మదర్శనంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు.

News November 17, 2024

వేములవాడకు సీఎం రేవంత్ రెడ్డి.. పూజల వివరాలు ఇవే: ఈవో

image

సీఎం రేవంత్ రెడ్డి బుధవారం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి దర్శనానికి వస్తున్నారు. భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా భక్తుల సౌలభ్యార్థం అర్జిత సేవల్లో స్వల్ప మార్పులు చేసినట్లు ఈవో వినోద్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సర్వ దర్శనం, కోడె మొక్కుబడి, భక్తులచే నిర్వహించే అభిషేకాలు నిలుపుదల చేస్తున్నట్లు తెలిపారు.

News November 17, 2024

KNR: కొనుగోలు కేంద్రాలు వెలవెలబోతున్నాయి!

image

కరీంనగర్ జిల్లాలో ఈ సమయానికి ధాన్యంతో కల కళకళలాడాల్సిన కొనుగోలు కేంద్రాలు వెలవెల బోతున్నాయి. రైతులు కోతలు ప్రారంభించినప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించడంతో రైస్ మిల్లర్లకు తక్కువ ధరకు అమ్ముకున్నారు. ప్రస్తుతం కేంద్రంలో కూడా తాలు పేరిట అధిక కాంట వేయడంతో రైతులు నష్టాలు పాలవుతున్నారు. రైతులు నేరుగా రైస్ మిల్లర్లను ఆశ్రయించడంతో కొనుగోలు కేంద్రాలు వెలవెలబోతున్నాయి.