News February 28, 2025
కరీంనగర్: స్ట్రాంగ్ రూమ్స్‌కు సీల్ వేసిన రిటర్నింగ్ అధికారి

కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో ఎమ్మెల్సీ ఎన్నికల బాక్స్‌లు నిల్వచేసిన స్ట్రాంగ్ రూమ్‌కు సీల్ వేసినట్లు ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఎన్నికల పరిశీలకులు మహేశ్ దత్ ఎక్కా ఇతర ముఖ్యఅధికారుల సమక్షంలో సీల్ వేశామన్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయుల బ్యాలెట్ బాక్స్‌లను వేరువేరుగా భద్రపరిచామన్నారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News March 1, 2025
కరీంనగర్: ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్ పమేలా

మార్చి 5 నుంచి 25 జిల్లాలో నిర్వహించే ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఇంటర్ పరీక్షలు ఉ. 9.00 నుంచి మ.12.00 వరకు పరీక్షలు జరుగుతాయని, ఇంటర్ మొదటి సంవత్సరంలో 17799 మంది, రెండో సంవత్సరంలో 17763 మొత్తం 35562 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇందుకుగాను 37 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
News February 28, 2025
కరీంనగర్: ఎల్‌ఎండీలో ఆర్టీసీ డ్రైవర్ మృతి

కరీంనగర్‌లోని లోయర్ మానేరు డ్యామ్‌లో ఈతకు వెళ్లిన ఆర్టీసీ డ్రైవర్ తిరుపతి రావు (59) ప్రమాదవశాత్తు మృతి చెందాడు. రోజూలాగే ఉదయం స్నేహితులతో ఈతకు వెళ్లిన తిరుపతి రావు ప్రమాదవశాత్తు మృతి చెందాడని, కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కరీంనగర్ పోలీసులు తెలిపారు.
News February 28, 2025
కరీంనగర్: 2019లో 59.03%.. 2025లో 70.42%

ఉమ్మడి KNR, MDK, NZB, ADB పట్టభద్రులు, ఉపాధ్యాయ MLC ఎన్నికల పోలింగ్ నిన్న జరగగా.. మార్చి 3న కరీంనగర్‌లో లెక్కింపు జరగనుంది. అయితే, 2019లో పట్టభద్రుల పోలింగ్ 59.03శాతం నమోదు కాగా, 2025లో 70.42 శాతం నమోదైంది. ఉపాధ్యాయ పోలింగ్ 2019లో 83.54శాతం నమోదు కాగా, 2025లో 91.90శాతం పోలింగ్ జరిగింది. 2019 ఎన్నికలతో పోలిస్తే పట్టభద్రుల పోలింగ్ 11.39శాతం, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ 8.36 శాతం పెరిగింది.