News February 2, 2025
కరీంనగర్ స్పోర్ట్స్ మీట్.. ఖోఖోలో సిరిసిల్ల థర్డ్ ప్రైజ్
కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మూడో పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ పోటీల్లో రాజన్న సిరిసిల్ల జోన్ ఖోఖో విభాగంలో మూడో బహుమతి గెలుచుకుంది. తృతీయ బహుమతి పొందిన టీం కెప్టెన్ అల్లం రమేష్(ట్రాఫిక్ ఎస్ఐ) టీం సభ్యులను రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, జిల్లా పోలీసు అధికారులు సిబ్బంది అభినందించారు.
Similar News
News February 2, 2025
డోర్నకల్: గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పోలీస్ స్టేషన్లో విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్లో రైటర్‌గా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సోమేశ్వరరావు తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. దంతాలపల్లి మండలం పెద్ద ముప్పారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సహచర కానిస్టేబుల్ మృతిపై డోర్నకల్ పోలీసులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
News February 2, 2025
రేపు స్కూళ్లకు సెలవు ఉందా?
వసంత పంచమి పర్వదినాన్ని ఈ రోజు జరుపుకొంటున్నప్పటికీ రేపు కూడా పంచమి తిథి ఉంది. తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఆప్షనల్ హాలిడే ఇచ్చింది. దీని ప్రకారం రేపు సెలవు విద్యాసంస్థల యాజమాన్యాలపై ఆధారపడి ఉంటుంది. అటు ఏపీలో ఎలాంటి ఆప్షనల్ హాలిడే లేదు. మరి రేపు సెలవు ఉన్నట్లు మీకు స్కూల్ నుంచి మెసేజ్ వచ్చిందా? కామెంట్ చేయండి.
News February 2, 2025
కేంద్ర బడ్జెట్‌పై కరీంనగర్ MP ప్రశంసలు
కేంద్ర బడ్జెట్ 2025-26 కేవలం లెక్కల పద్దు మాత్రమే అని, ఇది ప్రధాని మోదీ దార్శనికత, స్వావలంబన, వృద్ధి, శ్రేయస్సుతో కూడిన వికసిత భారత్‌కు ఒక రోడ్ మ్యాప్ అని కరీంనగర్ MP, కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. రైతు సంక్షేమం, మధ్యతరగతికి ఉపశమనం, మహిళలు, యువతకు సాధికారత కల్పించడం, స్టార్టప్‌లకు ప్రోత్సాహం వంటివి ఈ బడ్జెట్‌లో చూడవచ్చన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులను ప్రోత్సహించారని వివరించారు.