News March 25, 2025

కరీంనగర్‌కు రెండు కొత్త కాలేజీలు

image

కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీకి ప్రభుత్వ ఇంజనీరింగ్, లా కళాశాలలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ రెండు కళాశాలల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. శాతవాహన యూనివర్సిటీలో లా కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల కావాలని ఎప్పటినుంచో అనేక పోరాటాలు విద్యార్థి సంఘ నాయకులు చేశారు. శాతవాహన యూనివర్సిటీకి ఈ రెండు కళాశాలలు మంజూరు కావడంతో విద్యార్థి సంఘాలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News March 26, 2025

KNR: సరైన అవగాహన.. సైబర్ నేరాలకు నివారణ

image

కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో రాష్ట్ర విద్యా కమిషన్ సలహాదారులు ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ నేరాలపై రైసింగ్ సన్ యూత్ క్లబ్ సహకారంతో కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈజీ మనీ కోసం ఆశపడి అందమైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు. బెట్టింగ్ నడిపే వారితో పాటు బెట్టింగ్‌లో పాల్గొనే వారిపై నిఘా ఉంటుందని అన్నారు.

News March 26, 2025

సైదాపూర్: వృద్ధురాలిపై యువకుడి అత్యాచారం

image

సైదాపూర్ మండలంలోని ఓ గ్రామంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. 70 ఏళ్ల వృద్ధురాలిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆదివారం రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో యువకుడు ఆమెపై ఈ దారుణానికి ఒడిగట్టాడు. అనంతరం ఎవరికైనా జరిగిన విషయం చెబితే చంపుతానని బెదిరించి అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News March 26, 2025

KNR: జపాన్-ఆసియా యువ విజ్ఞాన మార్పిడి కార్యక్రమానికి యువ ఆవిష్కర్త ఎంపిక

image

కరీంనగర్‌కు చెందిన యువ ఆవిష్కర్త శుభ శ్రీ సాహు ఓ ప్రవేట్ పాఠశాలలో చదువుతున్నప్పుడు రైతులకోసం ఒక వినూత్న వ్యవసాయ యంత్రాన్ని రూపొందించారు. ఇటీవల ఆ ప్రాజెక్టు రూపొందించిన శుభ శ్రీ జపాన్౼ఆసియా యువ విజ్ఞాన మార్పిడి కార్యక్రమానికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శుభ శ్రీ ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పాఠశాల ఛైర్మన్ ప్రత్యేకంగా అభినందించారు.

error: Content is protected !!