News February 6, 2025

కరీంనగర్‌లో రేపు జాబ్ మేళా..!

image

కరీంనగర్‌లోని స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల(ఆటానమస్)లో శుక్రవారం జాబ్ మేళా జరగనుందని ప్రిన్సిపల్ ప్రొ.డీ.వరలక్ష్మీ తెలిపారు. ఈ ఉద్యోగ మేళా ఉదయం 9గంటలకు ప్రారంభమవుతుందని.. ఈ అవకాశాన్ని స్థానికంగా ఉండే ప్రతి నిరుద్యోగి సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ జాబ్ డ్రైవ్‌లో పలు ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని చెప్పారు. ఇంటర్వ్యూకి అవసరమయ్యే అన్ని డాక్యుమెంట్స్‌ను వెంట తెచ్చుకోవాలన్నారు.

Similar News

News February 6, 2025

కొండపాక: సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

image

కొండపాక మండలంలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌ను కలెక్టర్ మిక్కిలినేని మనూచౌదరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్‌లోని బియ్యం, నిత్యావసర వస్తువులు, వంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠాలు బోధించారు. నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని అధికారులకు సూచించారు.

News February 6, 2025

కందుకూరు YCPఅనుబంధ విభాగాల అధ్యక్షులు వీరే..

image

కందుకూరు నియోజకవర్గ YCPఅనుబంధ విభాగాల అధ్యక్షులను ఆ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ప్రకటించింది. యువజన విభాగం: మద్దసాని నవీన్ కృష్ణ, మహిళా విభాగం: Tఆదిలక్ష్మి, రైతు విభాగం: N చంద్రమౌళి, లీగల్ సెల్: కొత్తూరి హరికోటేశ్వరరావు, SCసెల్: దగ్గుమాటి కోటయ్య, STసెల్: చేవూరి శ్రీనివాసమూర్తి, గ్రీవెన్స్ సెల్: Yనాగభూషణం, మున్సిపల్ వింగ్: పిడికిటి శంకర్, బూత్ కమిటీస్: కోడూరి వసంతరావు తదితరులు నియమితులయ్యారు.

News February 6, 2025

ఒక్కరోజు వ్యవధిలోనే గుండెపోటుతో తండ్రి, కొడుకు మృతి

image

ఒక్కరోజు వ్యవధిలోనే తండ్రి, కొడుకు గుండెపోటుతో మృతి మృతిచెందారు. ఈ విషాద ఘటన మండల కేంద్రం చాగలమర్రిలో జరిగింది. కోటగడ్డ వీధికి చెందిన కుమారుడు ముల్లా రబ్బాని(28) బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందగా, ఆ బాధతో తండ్రి జహంగీర్ బాషా(60) నేడు గుండెపోటుకు గురై మరణించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

error: Content is protected !!