News June 11, 2024

కర్నూలు: అన్ని మండలాల్లో భారీ తెరలు

image

ఉమ్మడి జిల్లాలోని ఎంపీడీవో కార్యాలయాల ప్రాంగణాల్లో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని భారీ తెరలపై వీక్షించే ఏర్పాట్లు చేయాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. ‘లైవ్‌ స్ట్రీమింగ్‌’ విధానంలో తెరలపై ప్రదర్శిస్తారు. నియోజకవర్గంలో ఒకచోట ఎక్కువ మంది వీక్షించేలా భారీ తెరలు సిద్ధం చేయాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.

Similar News

News December 13, 2025

లోక్ అదాలత్‌లో 19,577 కేసులు పరిష్కారం

image

జాతీయ లోక్‌అదాలత్‌లో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మొత్తం 19,577 కేసులు పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్తి తెలిపారు. జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో 28 బెంచీల ద్వారా 284 సివిల్, 19,096 క్రిమినల్, 197 మోటార్ యాక్సిడెంట్ కేసులను పరిష్కరించారు. మోటార్ ప్రమాదాలకు సంబంధించిన కేసుల్లో బాధితులకు రూ. 6.34 కోట్ల నష్టపరిహారం చెల్లించినట్లు ఆయన వివరించారు.

News December 13, 2025

నవోదయ ప్రవేశ పరీక్ష ప్రశాంతం

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జోహార్ నవోదయ అర్హత పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని పాఠశాల ప్రిన్సిపల్ పద్మావతి తెలిపారు. ఆరో తరగతి ప్రవేశం కోసం ఈ పరీక్షను నిర్వహించారు. జిల్లాలో మొత్తం 24 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 6,469 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోగా, 4,548 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు వివరించారు.

News December 13, 2025

కర్నూలు: ఆటో కొనివ్వలేదని సూసైడ్

image

నంద్యాల(D) బ్రాహ్మణకొట్కూరుకు చెందిన రామాంజనేయులు(30) ఆత్మహత్య చేసుకున్నాడు. లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న ఈయన.. కొంతకాలంగా మద్యానికి బానిసై పనికి వెళ్లలేదు. ఆటో నడుపుతానని, కొనుగోలుకు డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులను ఒత్తిడి చేశాడు. మద్యం మానితే కొనిస్తామని చెప్పడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈనెల 2న కల్లూరు(M) పందిపాడు సమీపంలో పురుగుమందు తాగాడు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. కేసు నమోదైంది.