News June 15, 2024
కర్నూలు: ఉద్యోగ మేళాలో 64 మంది ఎంపిక
నిరుద్యోగులకు ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి అధికారి దీప్తి పేర్కొన్నారు. సీ.క్యాంపులోని కార్యాలయంలో వివిధ కంపెనీలతో జాబ్ మేళా నిర్వహించారు. ఇనోవిజన్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ ప్రై. లిమిటెడ్, జియో టవర్స్, నవభారత్ ఫర్టిలైజర్స్, అమర్ రాజా కంపెనీల వారు హాజరయ్యారు. మొత్తం 197 మంది హాజరు కాగా.. 64 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని ఆమె తెలిపారు.
Similar News
News January 20, 2025
కొత్తపల్లి: బయల్పడుతున్న సంగమేశ్వరాలయం
కొత్తపల్లి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సప్త నదుల సంఘం క్షేత్రంలోని సంగమేశ్వరాలయం నెమ్మదిగా బయలు పడుతోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 855.90 అడుగుల మేర నీటి నిల్వలు ఉండడంతో ఆలయం పది అడుగుల మేర బయల్పడింది. మరో 18 అడుగులు తగ్గినట్లయితే ఆలయం పూర్తిస్థాయిలో బయలు పడనుంది. జులై నెలలో నీటి మునిగిన సంగమేశ్వరుడు నెమ్మదిగా జలాధివాసం నుంచి విముక్తి పొందుతున్నారు.
News January 20, 2025
బేతంచెర్ల మండలంలో మహిళ ఆత్మహత్య
బేతంచెర్ల మండలం గొర్లగుట్ట గ్రామానికి చెందిన బోయ నాగలక్ష్మి(39) కడుపు నొప్పి తాళలేక పేడ రంగు నీళ్లు తాగి ఆత్మహత్య చేసుకుందని హెడ్ కానిస్టేబుల్ రామచంద్ర గౌడ్ ఆదివారం తెలిపారు. కొంతకాలంగా కడుపు నొప్పితో ఇబ్బంది పడుతూ ఉండేదని, వైద్యం చేయించినా నయం కాలేదన్నారు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పేడ రంగు నీళ్లు తాగి ఆత్మహత్య చేసుకుందని వెల్లడించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
News January 20, 2025
ఆత్మకూరు: డ్రోన్ కెమెరాలతో పోలీసుల నిఘా
ఫైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆత్మకూరు రూరల్ ఇన్‌స్పెక్టర్ సురేశ్ కుమార్ రెడ్డి తెలిపారు. పాములపాడు గ్రామ శివారులోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం, అసాంఘిక కార్యకలాపాలు, పేకాట వంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. డ్రోన్ కెమెరాలను ఉపయోగించి బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న వారిని గుర్తించి, కేసులు నమోదు చేశామన్నాన్నారు.