News April 24, 2025

కర్నూలు జిల్లా టాపర్లు వీరే!

image

కర్నూలు జిల్లా విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో అదరగొట్టారు. జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన ఏడుగురు 597 మార్కులు సాధించి జిల్లా టాపర్లుగా నిలిచారు. కర్నూలుకు చెందిన టి.గాయత్రి, గీతిక, కీర్తన, ఎమ్మిగనూరుకు చెందిన మహ్మద్, ఆదోనికి చెందిన సలీమా, జి.నందు, హరిణి టాపర్ల జాబితాలో ఉన్నారు. ఇక జిల్లాలో మొత్తం 31,185 మంది పరీక్ష రాయగా 20,584 మంది పాసయ్యారు. 

Similar News

ఏ సబ్జెక్టులో ఎంతమంది ఫెయిల్ అయ్యారంటే!

image

కర్నూలు జిల్లాలో 31,185 మంది పదో తరగతి పరీక్షలు రాయగా 9,601 మంది ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. తెలుగులో 2,598 మంది, హిందీలో 292, ఇంగ్లీష్‌లో 4,660, మ్యాథ్స్ 7,781, సైన్స్ 6,900,  సోషల్‌లో 4,497 మంది ఫెయిల్ అయినట్లు అధికారులు తెలిపారు. ఇక తెలుగులో 91 మంది, హిందీలో 15, ఇంగ్లీష్‌లో 1, మ్యాథ్స్ 22, సైన్స్‌ 21, సోషల్‌లో 15 మంది 100/100 మార్కులు సాధించారని వివరించారు.

News April 24, 2025

క్రీడాకారులను అభినందించిన జిల్లా కలెక్టర్

image

జాతీయ స్థాయి టైక్వాండో పోటీలకు ఎంపికైన క్రీడాకారులను జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఘనంగా సత్కరించారు. మే నెలలో ఉత్తరాఖండ్‌లో జరగబోయే జాతీయస్థాయి కేడేట్, జూనియర్స్ విభాగాలలో జిల్లా క్రీడాకారులు పాల్గొని విజేతలుగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీఎస్డీవో భూపతిరావు, కోచ్ షబ్బీర్ హుస్సేన్ పాల్గొన్నారు.

error: Content is protected !!