News February 21, 2025

కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు 

image

➤ కర్నూలులో తొలి జీబీఎస్ కేసు నమోదు. ➤ ఎమ్మిగనూరులో మహిళా దొంగల హల్ చల్. ➤ ఈ నెల 23న గ్రూప్-2 పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ. ➤ తుగ్గలి వద్ద బస్సు బోల్తా. ➤ పెద్దకడబూరు: నకిలీ ఇల్లు పట్టాలు.. వ్యక్తిపై కేసు. ➤ జగన్‌కు Z+ భద్రత కల్పించాలని ఎస్వీ మోహన్ రెడ్డి డిమాండ్. ➤ గ్రూప్-2 అభ్యర్థుల కోసం 08518-277305 హెల్ప్ డెస్క్ నంబర్. ➤ ఏపీ ఓబీసీ జిల్లా అధ్యక్షుడిగా చల్లా వరుణ్. 

Similar News

News February 22, 2025

కర్నూలు: రెవెన్యూ అధికారులతో సబ్ కలెక్టర్ సమీక్ష

image

గోనెగండ్ల మండలం తహశీల్దార్ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్, రీ ఓపెన్, గ్రామసభ, రెవెన్యూ సభ, రెవెన్యూ సంబంధించిన అంశాలపై ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సంబంధిత అధికారులతో శనివారం సమీక్షించారు. పెండింగ్ భూ సమస్యల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా ప్రజా సమస్యల పరిష్కాానికి కృషి చేయాలని ఆదేశించారు. తహశీల్దార్ కుమారస్వామి, డీటీ విష్ణుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

News February 22, 2025

కర్నూలు: ‘రెండుసార్లు కవల పిల్లలకు జన్మినిచ్చారు’ (PHOTO)

image

నేడు అంతర్జాతీయ కవలల దినోత్సవంగా జరుపుకుంటారు. కర్నూలు జిల్లా నందవరం గ్రామానికి చెందిన ఫక్కీరప్ప, కృపావతి దంపతులు మొదట ఇద్దరు ఆడ కవల పిల్లలకు జన్మినిచ్చారు. రెండో కాన్పులో ఇద్దరు మగ కవల పిల్లలను కన్నారు. వారికి స్నేహ, శ్వేత, అఖిల్, నిఖిల్‌గా నామకరణం చేశారు. కవల పిల్లలతో తాము సంతోషంగా ఉన్నామని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.

News February 22, 2025

నల్లమల అడవుల్లో దారి తప్పిన భక్తులు

image

తెలంగాణ రాష్ట్రం కొల్లాపూర్‌కు చెందిన కొందరు శివస్వాములు పాదయాత్రతో శ్రీశైలం వస్తూ నల్లమల అటవీ ప్రాంతంలో దారి తప్పారు. మనోజ్, గురుప్రసాద్, రాజు, గోపాల్, మరో ముగ్గురు ఆత్మకూరు పరిధిలోని ఇందిరేశ్వరం గ్రామం నుంచి గూగుల్ మ్యాప్ ద్వారా అడవి ప్రాంతంలోకి ప్రవేశించి, దారి తప్పారు. పోలీసుల ద్వారా సమాచారం తెలుసుకున్న రెస్క్యూ టీం జీపీఎస్ ఆధారంగా వారుండే ప్రాంతానికి చేరుకుని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

error: Content is protected !!