News April 8, 2025

కర్నూలు జిల్లా ముఖ్యాంశాలు

image

➤మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి హౌస్ అరెస్ట్ ➤ వెల్దుర్తి: బొమ్మిరెడ్డిపల్లెలో టెన్షన్.. టెన్షన్..➤ కర్నూలును మెడికల్ హబ్‌గా మారుస్తాం: ఎంపీ➤ బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసింది ఇక్కడే..!➤ పెద్దకడబూరు: ‘ప్రవీణ్ మృతిపై విచారణ జరపాలి’➤ కౌతాళం: తుంగభద్ర కాలువలో పడి వ్యక్తి మృతి➤ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ.. పెద్దల సమక్షంలో పెళ్లి➤ కర్నూలు: ఫీల్డ్ అసిస్టెంట్లపై రాజకీయ ఒత్తిళ్లను ఆపాలి

Similar News

News April 8, 2025

వైసీపీ కార్యకర్తలపై దాడులను సహించం: కాటసాని

image

అధికార పార్టీ నాయకుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైసీపీ శ్రేణులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి భరోసా ఇచ్చారు. బనగానపల్లె నియోజకవర్గం కోవెలకుంట్లలో సోమవారం నూతన కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వైసీపీ శ్రేణులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను మాజీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేది లేదని కాటసాని హెచ్చరించారు.

News April 8, 2025

కర్నూలు రేంజ్‌లో సీఐల బదిలీలు

image

కర్నూలు రేంజ్ పరిధిలో సీఐలను బదిలీ చేస్తూ డీఐజీ కోయ ప్రవీణ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సిరివెళ్ల సీఐ వంశీధర్ నంద్యాల వీఆర్‌కు, దస్తగిరి బాబు అన్నమయ్య డీటీసీ నుంచి సిరివెళ్ల, ప్రభాకర్ రెడ్డి అన్నమయ్య ఎస్సీ, ఎస్టీ సెల్ నుంచి నంద్యాల ఫ్యాక్షన్ జోన్, గౌతమి కర్నూల్ డీటీసీ నుంచి నంద్యాల ఉమెన్ పీఎస్, రమేశ్ కుమార్ నంద్యాల ఉమెన్ పీఎస్ నుంచి నంద్యాల వీఆర్, కృష్ణయ్య డీసీఆర్బీ నంద్యాలకు బదిలీ అయ్యారు.

News April 7, 2025

కర్నూలును మెడికల్ హబ్‌గా మారుస్తాం: కర్నూలు ఎంపీ

image

కర్నూలును మెడికల్ హబ్‌గా మారుస్తామని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. సోమవారం నగరంలో నిర్వహించిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ప్రతి ఒకరూ తమ ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి సంబంధించి అనేక పథకాలను తీసుకొచ్చిందని, వాటిని అందరూ ఉపయోగించుకోవాలన్నారు.

error: Content is protected !!