News February 23, 2025

కర్నూలు జిల్లాలో 30 కేంద్రాల్లో గ్రూప్-2 పరీక్ష

image

గ్రూప్-2 వాయిదా వేయాలంటూ ప్రభుత్వ చేసిన విజ్ఞప్తిని APPSC తిరస్కరించడంతో నేడు పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి. కర్నూలు జిల్లాలో 30 కేంద్రాల్లో 9,993 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు పేపర్-1, మ.3 గంటలకు పేపర్-2 పరీక్ష జరగనుంది. అభ్యర్థులు 15 నిమిషాలు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు తెలిపారు.

Similar News

News February 23, 2025

కర్నూలు జిల్లాలో కిలో చికెన్ ఎంతంటే?

image

బర్డ్ ఫ్లూ భయంతో చికెన్‌కు డిమాండ్ తగ్గింది. ఎక్కువ మంది నాటుకోడి, మటన్ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఇవాళ కిలో చికెన్ రూ.180-200 పలుకుతోంది. నాటుకోడి కిలో రూ.400, మటన్ కిలో రూ.750-800లతో విక్రయాలు సాగుతున్నాయి. జిల్లాలోని అన్ని మండలాల్లో దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి.

News February 22, 2025

కర్నూలు జిల్లా TODAY TOP NEWS..!

image

➤ విద్యార్థిని అశ్లీల చిత్రాలతో వ్యాపారం.. నిందితుల అరెస్టు. ➤ కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు గురు భక్తి ఉత్సవాల ఆహ్వాన పత్రిక. ➤ వలసలు వెళ్లకుండా పనులు కల్పించాలని కలెక్టర్ ఆదేశాలు. ➤ జాతీయ స్థాయి స్కాలర్‌షిప్‌లో కోసిగి విద్యార్థుల ప్రతిభ. ➤ వరి రైతులను ముప్పుతిప్పలు పెడుతున్న విదేశీ పర్ఫాల్ స్వాపెన్ పక్షులు. ➤ కర్నూలు: రెండుసార్లు కవల పిల్లలకు జన్మనిచ్చారు. ➤ జిల్లాలో రెచ్చిపోతున్న హిజ్రాలు.

News February 22, 2025

కర్నూలు: రెవెన్యూ అధికారులతో సబ్ కలెక్టర్ సమీక్ష

image

గోనెగండ్ల మండలం తహశీల్దార్ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్, రీ ఓపెన్, గ్రామసభ, రెవెన్యూ సభ, రెవెన్యూ సంబంధించిన అంశాలపై ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సంబంధిత అధికారులతో శనివారం సమీక్షించారు. పెండింగ్ భూ సమస్యల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా ప్రజా సమస్యల పరిష్కాానికి కృషి చేయాలని ఆదేశించారు. తహశీల్దార్ కుమారస్వామి, డీటీ విష్ణుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!