News April 22, 2025
కర్నూలు జిల్లాలో ఆశాజనకంగా పత్తి ధరలు.!

కర్నూలు జిల్లాలో వారం రోజుల్లో పత్తి ధరలు పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో దూది గింజల ధర స్వల్పంగా పెరగడం, పత్తి జిన్నింగ్ ప్రెస్సింగ్ పరిశ్రమల ఉత్పత్తికి అవసరమైన పత్తి మార్కెట్‌కి రాకపోవడంతో ధరలు పెరిగాయి. ఆదోని మార్కెట్‌లో సోమవారం పత్తి క్వింటాల్ ధర గరిష్ఠంగా రూ.8,179 గా ఉంది. గత వారంతో పోలీస్తే రూ.200లకు పెరిగింది. కనిష్ఠ ధర రూ.4,509 ఉండగా సగటు ధర రూ.7,589కి పలికింది.
Similar News
News April 22, 2025
తండ్రీకూతురి ప్రాణం తీసిన లారీ

ఆలూరు మండలం పెద్దహోతూరు వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో తండ్రీకూతురు మృతి చెందిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాల మేరకు.. మృతులు ముత్తుకూరు చెందిన వడ్డే ఈరన్న, శ్రావణిగా గుర్తించారు. బాలిక చిప్పగిరి KGBV పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. పాఠశాలకు సెలవులు ఇవ్వడంతో కుమార్తెను తండ్రి బైక్‌పై ఇంటికి తీసుకెళ్తుండగా లారీ ఢీకొని దుర్మరణం చెందారు. పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
News April 22, 2025
కర్నూలు జిల్లాలో ప్రమాదం.. తండ్రీ కూతుళ్లు మృతి

రోడ్డు ప్రమాదంలో తండ్రీ కూతుళ్లు మృతి చెందిన విషాద ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. తండ్రి, కూతురు కలిసి బైక్‌పై వెళ్తుండగా ఆలూరు మండలం పెద్దహోతూరు వద్ద ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనగా తండ్రీ కూతుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఆస్పిరి మండలం ముత్తుకూరుకు చెందినవారిగా గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
News April 22, 2025
రేపే రిజల్ట్.. కర్నూలు జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 10 గంటలకు మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. కర్నూలు జిల్లాలో 40,776 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.